Coronavirus updates in India: దేశంలో పెరుగుతున్న కరోనా ఉధృతి.. తాజాగా కొత్త కేసులు, మరణాలు ఇలా ఉన్నాయి..
Coronavirus updates in India: భారత్‌లో కరోనావైరస్ ఉధృతి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో
Coronavirus updates in India: భారత్‌లో కరోనావైరస్ ఉధృతి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఆందోళన నెలకొంది. ఇటీవల వరుసగా వేల సంఖ్యలో కేసులు పెరగుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 25,320 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,13,59,048 కోట్లకు చేరింది. ఈ మహమ్మారి కారణంగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 161 మంది మరణించారు. వీరితో కలిపి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,58,607 కు పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
కరోనా కేసులతో పోల్చుకుంటే.. డిశ్చార్జ్‌ల సంఖ్య రోజూ గణనీయంగా తగ్గుతోంది. కరోనా నుంచి నిన్న 16,637 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు 1,09,89,897 మంది బాధితులు కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 2,10,544 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 96.82 శాతం,యక్టీవ్ కేసులు 1.78 శాతం, మరణాల రేటు 1.40 శాతంగా ఉంది.
కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ పక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. ఇదిలాఉంటే.. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో ఆ తరువాత కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో పలుచోట్ల లాక్‌డౌన్ విధించి చర్యలు తీసుకుంటున్నారు.
మహారాష్ట్రలో కొత్తగా 15,602 కేసులు నమోదయ్యాయి. 8047 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 7467 మంది కోలుకున్నారు. తాజాగా 88 మంది చనిపోయారు. కేరళలో 2035 కేసులు కొత్తగా నమోదయ్యాయి. 1230 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 12 మంది మృతిచెందారు. కర్ణాటకలో 921 కేసులు కొత్తగా నమోదయ్యాయి. 72 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తాజాగా ఒకరు కరోనాతో మృతిచెందారు.