AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

International Question day 2021: అల్బర్ట్ ఐన్‏స్టీన్ పుట్టిన రోజును క్వశ్చన్ డేగా ఎందుకు జరుపుకుంటామో తెలుసా?

ప్రశ్నించడం మానేవేయడం లేదంటే అర్థం.. దాని వెనక ఉండే క్యూరియాసిటీకి వల్లనే అది సాధ్యం. అంటాడు ఐన్‏స్టీన్. ప్రశ్నలు

International Question day 2021: అల్బర్ట్ ఐన్‏స్టీన్ పుట్టిన రోజును క్వశ్చన్ డేగా ఎందుకు జరుపుకుంటామో తెలుసా?
Albert Einstein
Rajitha Chanti
|

Updated on: Mar 14, 2021 | 11:14 AM

Share

ప్రశ్నించడం మానివేయడం లేదంటే అర్థం.. దాని వెనక ఉండే క్యూరియాసిటీ వల్లనే అది సాధ్యం…అంటాడు ఐన్‏స్టీన్. ప్రశ్నలు అడిగేందుకు ఎప్పుడు సంకోచించకూడదు. మీలోని సందేహాలను తొలగించుకోవడానికి ప్రశ్నించడం ఒక మంచి పద్దతి. ఇది మీ మెదడును చురుకుగా ఉంచడమే కాకుండా.. పదునుగా చేస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడు ప్రశ్నించడం మానకూడదు.. ఇవి ఐన్‏స్టీన్ మాటలు. మార్చి 14న బౌతిక శాస్త్రవేత్త అల్పర్ట్ ఐన్‏స్టీన్ పుట్టినరోజు సందర్భంగా “ఇంటర్నెషనల్ క్వశ్చన్ డే” గా జరుపుకుంటారు.

ఇంటర్నెషనల్ క్వశ్చన్ డే 2021 చరిత్ర..

భౌతిక శాస్త్రవేత్తలలో ఒకరైన అల్బర్ట్ ఐన్‏స్టీన్ జన్మదినాన్ని ఇంటర్నెషనల్ క్వశ్చన్ డేగా జరుపుకుంటారు. సాపేక్షత సిద్దాంతాలను, క్యాంటం మెకానిక్స్ సిద్దాంతానికి ఆయన విసృత్తంగా కృషిచేశాడు. ఎప్పుడూ కొత్త ఆలోచనలతో ఉండే ఐన్‏స్టీన్… తన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఎన్నో ప్రశ్నలను సందించేవాడు. అలా ఐన్‏స్టీన్ మెదడులో కలిగిన ప్రశ్నలకు సమాధానంగానే E=MC2 ఫార్ములాను కనిపెట్టారు. ఈ ఫార్ములా భౌతిక శాస్త్రంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడింది.

ఇంటర్నెషనల్ క్వశ్చన్ డే 2021 ప్రాముఖ్యత..

ఈరోజున ఎలాంటి ప్రశ్నలు.. ఏ విధంగా ప్రశ్నించాలి అనే వివరాలను తెలియజేస్తుంది. అలాగే చుట్టూ ఉన్న విషయాల పట్ల కలిగే ఆసక్తిని అలాగే.. వాటిపై సందించే ప్రశ్నలను ఎలా సమాధానం తెలుసుకోవాలో చెప్పడానికి సహయపడుతుంది. ప్రశ్నలు అడగడం, స్పష్టమైన సమాధానాలు తెలుసుకోవడమే కాకుండా.. స్పష్టంగా ఆలోచించడానికి కూడా ఈ ఇంటర్నెషనల్ క్వశ్చన్ డే జరుపుకుంటాం.

ఇంటర్నెషనల్ క్వశ్చన్ డే జరుపుకునే విధానం..

ముఖ్యంగా విద్యార్థులకు ఈరోజున జరిగే ఇంటర్నెషనల్ క్వశ్చన్ డే ప్రశ్నలు వేయడంలో ఎలాంటి బిడియం లేకుండా ప్రొత్సహిస్తుంది. అలాగే వారి చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల ఆసక్తిని పెంచడమే కాకుండా.. ప్రశ్నించడం వంటి అలవాట్లను అలవరుచుకోవడానికి సహయపడుతుంది. ఇందుకోసం పాఠశాల్లలో ఈ ఇంటర్నెషనల్ క్వశ్చన్ డేను జరుపుకోవాలి. ఎలా జరుపుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈరోజున ఉపాధ్యాయులు విద్యార్థులకు వారి విషయాలకు సంబంధించిన సందేహలకు సమాధానాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటూ.. వారి కోసం ఓ ప్రోగ్రాం జరపాలి. ఇందులో ఉపాధ్యాయులు విద్యార్థులను ఐన్ స్టీన్ కు సంబంధించిన కొన్ని విషయాలను అడగడం.. వారికున్న సందేహాలను తీర్చడం చేయాలి. అలాగే ఇంటర్నెషనల్ క్వశ్చన్ డేకు సంబంధించిన ప్రశ్నలను అడగడం.. ప్రశ్నలను అడిగేందుకు భయపడుతున్న విద్యార్థులను ప్రొత్సహించడం చేయాలి. ఇలా చేయడం వలన విద్యార్థులకు ఇంటర్నెషనల్ క్వశ్చన్ డే పట్ల అవగాహన పెరగడమే కాకుండా.. ప్రశ్నలు వేయడానికి వారు ఉత్సహం కనబరుస్తారు.

Also Read:

AP Municipal Election Results 2021 LIVE: ఏపీలో వెలువడుతున్న మున్సిపల్ ఫలితాలు… కొనసాగుతున్న వైఎస్ఆర్‌సీపీ హవా