Childrens Immunity: అసలే కరోనా కాలం.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తిని ఇలా పెంచండి..!

|

Sep 07, 2021 | 6:09 AM

Childrens Immunity: థర్డ్ వేవ్‌ రూపంలో కరోనా మహమ్మారి పిల్లలపై విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచాల్సిన అవసరం ఉంది. బలమైన రోగ నిరోధక శక్తి పిల్లల్లో..

Childrens Immunity: అసలే కరోనా కాలం.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తిని ఇలా పెంచండి..!
Immunity
Follow us on

Childrens Immunity: థర్డ్ వేవ్‌ రూపంలో కరోనా మహమ్మారి పిల్లలపై విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచాల్సిన అవసరం ఉంది. బలమైన రోగ నిరోధక శక్తి పిల్లల్లో కరోనా వ్యాప్తి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వారిని ఆరోగ్యంగా ఉంచుతుంది. పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి వారికి తినిపించే ఆహారంలో అనేక పోషకాలను చేర్చవచ్చు. పిల్లల రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎలాంటి పదార్థాలు ఆహారంలో చేర్చాలో ఇప్పుడు తెలుసుకుందాం..

తులసి..
అనేక ఆరోగ్య ప్రయోజనాలు, చికిత్సా లక్షణాలకు ప్రసిద్ధి చెందింది తులసి. దీనిని ‘మూలికల రాణి’గా పిలుస్తారు. ఇందులో విటమిన్లు ఎ, సి, కె పుష్కలంగా ఉంటాయి. ఈ తులసి పిల్లల్లో జ్వరాన్ని తగ్గిస్తుంది. జలుబు, దగ్గును అరికడుతుంది. అలాగే.. గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. తులసి ఆకులను పాలలో కలిపి తీసుకుంటే జ్వరం నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

పసుపు..
ప్రతి భారతీయ ఇంటిలో ప్రధానమైనది పసుపు. ఈ పసుపులో వ్యాధి నిరోధక లక్షణాలు ఉన్నాయి. ఇది ఆహార రుచిని పెంచుతుంది. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇది క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఎముకలను బలోపేతం చేయడానికి పసుపు పొడిని పాలలో కలపవచ్చు. ఇది జలుబు, దగ్గు, జ్వరం కోసం కూడా పసుపు పాలను తాగడం ఉత్తమం.

దాల్చిన చెక్క..
ఇది మనిషుల్లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. దాల్చిన చెక్క పొడిని చాక్లెట్ పాలలో కలపవచ్చు.

అల్లం-వెల్లుల్లి..
జలుబు, ఫ్లూకి కారణమయ్యే వైరస్‌లను నియంత్రిస్తుంది. అల్లం పాలు పిల్లలతో తాగిస్తే చాలా మంచిది. జలుబు, దగ్గు విషయంలో అర టీస్పూన్ అల్లం పొడి, జీలకర్ర పొడిని తేనెలో కలిపి సేవించండి. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మీరు దీనిని ముడి రూపంలో కూడా తినవచ్చు.

అశ్వగంధ..
ఈ పురాతన ఔషధ మూలిక శారీరక సమస్యలను నయం చేస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అశ్వగంధ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. కండరాలకు బలాన్ని ఇస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. పిల్లలు మరింత అలసటతో బాధపడుతుంటే, అశ్వగంధ పొడిని పాలలో కలిపి తాగించొచ్చు.

జీలకర్ర..
జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. జీలకర్రను వేయించి మెత్తగా చేసి, అందులో తేనె మిక్స్ చేసి తాగితే దగ్గు, గొంతు నొప్పి సమస్య తీరుతుంది. జీలకర్రను బియ్యం, ఇతర వంటకాలలో కూడా కలుపుకోవచ్చు.

లవంగం..
ఈ మసాలా దినుసులను కూరగాయలకు చేర్చడం వల్ల పిల్లలు సులభంగా తింటారు. కేకులు, బ్రెడ్‌లకు లవంగాల పొడిని కూడా కలుపుకోవచ్చు.

Also read:

Anger Management: మీకు తరచుగా కోపం వస్తుందా?.. అయితే, ఈ నాలుగు టిప్స్‌ని ట్రై చేయండి.. కోపాన్ని జయించండి..

SBI Apprentice Admit Card 2021: ఎస్‌బీఐ అప్రెంటిస్ ఎగ్గామ్ హాల్ టికెట్ విడుదల.. పూర్తి వివరాలివే..

SBI Offer: మీకు ఈ విషయం తెలుసా?.. ఎస్‌బీఐ బంపర్ ఆఫర్.. మరో వారం రోజులే గడువు.. పూర్తి వివరాలు మీకోసం..