Coriander Leaves Benefits: కొత్తిమీరలో ఔషధగుణాలతోపాటు ఎన్నో పోషకాలు దాగున్నాయి. కొత్తిమీర ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇవి జీర్ణక్రియను కూడా మెరుగుపర్చి.. శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. కొత్తిమీర హానికరమైన అంటువ్యాధులు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది. నాన్ వెజ్ (మాంసాహారం) నుంచి.. సాంబార్, రసం, పప్పు, కూర, పులుసు, పచ్చడి మొదలైన అనేక వంటకాల రూపాన్ని, వాసనను.. రుచిని మెరుగుపరచడానికి కొత్తిమీర ఆకులను ఉపయోగిస్తారు.
అయితే, కొత్తిమీర యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది మన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మనం తరచుగా అనారోగ్యానికి గురికాకుండా చేస్తుంది. కొత్తిమీర ఆకుల్లో ఉండే డైజెస్టివ్ ఎంజైమ్‌లు కడుపు వ్యాధులను తగ్గిస్తాయి. ఇది అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, బర్నింగ్ సెన్సేషన్, పొట్టలో ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.. ఇంకా జీవక్రియను మెరుగుపరుస్తుంది.
పచ్చి కొత్తిమీరలో యాంటీఆక్సిడెంట్లు, అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆకులను తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉన్నప్పుడు, ఊబకాయం పెరగదు. అంతేకాకుండా, హృదయనాళ ప్రమాదాలు కూడా తగ్గుతాయి.
కొత్తిమీరలో క్వెర్సెటిన్, టోకోఫెరోల్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంకా, కొత్తిమీర ఆకులు రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే న్యూరోప్రొటెక్టివ్ ప్రభావాలను కూడా కలిగి ఉంటాయి.
మూత్రపిండాలను శుభ్రపరచడానికి కొన్ని సహజ ఉత్పత్తులను ఉపయోగించవచ్చు. కొత్తిమీర కిడ్నీలోని టాక్సిన్స్‌ని బయటకు పంపడంలో సహాయపడుతుంది. కొత్తిమీరలో యాంటీమైక్రోబయల్, యాంటిడిప్రెసెంట్, యాంటీ మ్యుటాజెనిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు మూత్రపిండాల పనితీరుకు ఉపయోగపడతాయి. కిడ్నీ స్టోన్స్ కోసం మంచి హోంరెమెడీ కొత్తిమీర.. ఇది కిడ్నీలో రాళ్లతో సహా అన్ని కిడ్నీ సమస్యలను నయం చేయడానికి ఉపయోగపడుతుంది.
కొత్తిమీర ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచుతుంది. ఇది శరీరంలో రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీని ఆకు రసం సహాయంతో, శరీరంలో గ్లూకోజ్ స్థాయిని సమతుల్యం చేయడం చాలా సులభం.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..