Coriander Benefits: మన వంటింట్లో ఉండే చిన్న చిన్న మసాలా దినుసులే చిన్న చిన్న వ్యాధులకు మందులు.. ఈ మసాలా దినుసులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి చిన్న చిన్నరోగాలకు మెడిసిన్స్ వేసుకొంటే.. ఆ మందులు మన శరీరానికి అలవాటు అయ్యి మనలోని రోగ నిరోధక శక్తి పై ప్రభావం చూపిస్తాయి. అనంతరం మరింత మెరుగైన మందులకోసం మన శరీరం ఎదురుచూస్తుంది. నిజానికి చిన్న చిన్న వ్యాధులకు.. మనకు అందుబాటులో ఉన్న వాటితో.. సింపుల్ చిట్కాలతో.. నయం చేసుకోవచ్చు.. వంటిట్లో పోపుల పెట్టెలో ఉండే ధనియాలను కూరల్లో, మసాలా కోసం ఉపయోగిస్తారు. అయితే వీటిల్లో ఔషధగుణాలున్నాయి. ఈరోజు ఈ ధనియాల వల్ల ఉపయోగాల గురించి తెలుసుకుందాం
* వర్షాకాలంలో సహజంగా ఎక్కువమంది అజీర్ణ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి అజీర్తి ని ధనియాలతో తగ్గించుకోవచ్చు.. ధనియాల పొడిలో ఉప్పు కలుపుకుని రోజూ ఓ చెంచాడు తీసుకొంటే అజీర్తి తగ్గుతుంది.
*నిద్ర లేమితో బాధపడే వారు ధనియాల కషాయం చేసుకొని… ఆ కషాయం లో కొద్దిగా పాలు కలుపుకొని తాగితే.. నిద్ర బాగా పడుతుంది..
* ధనియాలు, జీలకర్ర, బెల్లం కలిపి నూరూకొని చిన్న చిన్న గుళికల్లా చేసుకొని మూడు పూటలా ఒక్కోటి వేసుకొంటే కీళ్ల నొప్పుల నుంచి విముక్తి కలుగుతుంది.
* గర్భవతులు రోజూ తమ ఆహారంలో విధిగా ధనియాలు తీసుకోవడంవల్ల ముఖ్యంగా ప్రసవించిన సమయంలో గర్భకోశానికి ఎంతో మేలు కలుగుతుంది
* అజీర్తి, పుల్లత్రేపులు, కడుపుబ్బరం గలవారికి ధనియాలు శుభ్రం చేసి కొంచెం ఉప్పు కలిపి దోరగా వేయించి మిక్సీలో వేసి పొడి చేసి రోజూ ఆ పొడి వాడుతూంటే నివారణ కల్గుతుంది.
* కడుపులో మంట, కడుపులో నొప్పి, తలనొప్పి, గడబిడ, మలబద్ధకం వున్నవారు ధనియాల పొడిని మజ్జిగలో కలుపుకొని త్రాగితే తగ్గిపోతుంది.
*బియ్యం కడిగిన నీటిని కలిపి ధనియాలు మెత్తగా నూరి, ముద్ద చేసి దానికి పటికబెల్లం చేర్చి కొద్ది మోతాదుల్లో తింటే పిల్లలకు తరచూ వచ్చే దగ్గు, ఆయాసం మటుమాయం
*శరీరంలోని వేడి తగ్గాలంటే రాత్రి ధనియాలు ఒక గ్లాస్ నీటిలో నానబెట్టి.. ఉదయాన్నే ధనియాలు తీసేసిన ఆ నీటిలో చక్కెర, పచ్చకర్పూరం వేసుకుని తాగితే శరీరానికి మంచిది..
*షుగర్, బీపీలను కంట్రోల్ లో ఉంచుతుంది.
*ధనియాలు రోజూ తీసుకోవడం వల్ల చిన్న పిల్లలతో పాటు.. స్త్రీలకు ఎక్కువగా మేలు చేస్తుంది.
Also Read: జూలై నెలలో జరిగే శ్రీవారి ఆర్జిత సేవల ఆన్‌లైన్ టికెట్ల కోటా విడుదల