Papaya Benefits
పండ్లు మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయనే విషయం మనందరికీ తెలిసిందే. వాటిలో ఉండే పోషకాలు మన శరీరానికి కావలసిన పోషకాలను అందించి, ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కల్పిస్తాయి. అలాంటి పండ్లలో బొప్పాయి కూడా ఒకటి. ఏ సీజన్‌లో అయినా అందుబాటులో ఉండే పండు ఏదైనా ఉందా అని అంటే అది కేవలం బొప్పాయి పండే. చౌకైన పండ్లలో ఇది కూడా ఒకటి. తక్కువ ధరకు లభిస్తుండటంతో చాలా మంది దీన్ని ఇష్టపడరు. కానీ ఈ పండులో అన్ని పండ్ల కంటే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్, కెరోటిన్, విటమిన్ C వంటి ఖనిజాలు, అర్జినైన్, కార్బైన్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వేసవిలో కూడా ఎక్కువగా లభించే ఈ బొప్పాయి తింటే రెట్టింపు లాభాలు కలుగుతాయి. మరి అవేమిటో మనం ఇప్పుడు తెలుసుకుకుందాం..
- జీర్ణ వ్యవస్థ: బొప్పాయిలో ఉండే పాపైన్ అనే డైజెస్టివ్ ఎంజైమ్ జీర్ణ రుగ్మతలు, మలబద్ధకాన్ని నివారిస్తుంది. అంతేకాదు భోజనం చేసిన తర్వాత తీసుకుంటే ఆహారం తేలికగా జీర్ణమై పొట్ట ఉబ్బరం కాకుండా ఉంటుంది.
- గుండె జబ్బులు: బొప్పాయిని రోజూ తినేవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ. కాబట్టి మీకు గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే రోజూ బొప్పాయిని తినండి.
- కొలెస్ట్రాల్: బొప్పాయిని తినడం వల్ల అందులో ఉండే అధిక పీచు శరీరంలోని అదనపు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
- క్యాన్సర్: బాగా పండిన బొప్పాయిని రోజూ తింటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. దీనికి ప్రధాన కారణం ఇందులో ఉండే శక్తివంతమైన పోషకాలు.
- శారీరక శక్తి: బొప్పాయిని రోజూ తీసుకుంటే శరీరం తాజాగా, దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
- బరువు తగ్గడం: బరువు తగ్గాలనుకునే వారికి బొప్పాయి చాలా మంచిది. బరువు తగ్గేందుకు రోజూ ఆహారంలో దీన్ని తీసుకోవడం వల్ల ఇందులోని పీచు ఆహారాన్ని తేలికగా జీర్ణమయ్యేలా చేసి, శరీరంలో కొవ్వు పదార్థాలు ఉండకుండా చేసి కరిగించి ఊబకాయాన్ని నివారిస్తుంది.
- కంటి చూపు: బొప్పాయిలో శక్తివంతమైన కెరోటిన్‌లు ఉంటాయి. ఇది కంటి సమస్యలను నివారిస్తుంది. కాబట్టి మీ కంటి లోపాన్ని నివారించడానికి ప్రతిరోజూ కొద్దిగా బొప్పాయిని తినండి.
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..