Health Tips: మలబద్ధకానికి ఈ ఆహార పదార్థాలతో చెక్‌.. అవేంటంటే..?

|

May 21, 2022 | 8:51 PM

Health Tips: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది ప్రజలు రకరకాల ఆరోగ్య సమస్యలని ఎదుర్కొంటున్నారు. ఇందులో కడుపు సంబంధిత

Health Tips: మలబద్ధకానికి ఈ ఆహార పదార్థాలతో చెక్‌.. అవేంటంటే..?
Constipation
Follow us on

Health Tips: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది ప్రజలు రకరకాల ఆరోగ్య సమస్యలని ఎదుర్కొంటున్నారు. ఇందులో కడుపు సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ పరిస్థితుల కారణంగా చాలామంది బయటి ఆహారాన్ని తినవలసి వస్తుంది. దీని కారణంగా గ్యాస్, మలబద్దకం సమస్య ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో వీటి నుంచి ఉపశమనం పొందడానికి కొన్నిచిట్కాలు పాటించాలి. వాటి గురించి తెలుసుకుందాం.

నీరు ఎక్కువగా తాగాలి

శరీరానికి నీరు చాలా ముఖ్యమని అందరికీ తెలుసు. కాబట్టి రోజు మొత్తంలో కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలి. దీని వల్ల మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో నీరు చాలా మేలు చేస్తుంది. వేసవి కాలంలో ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి.

ఇవి కూడా చదవండి

ఫైబర్ ఉండే ఆహారాలు

కడుపులో ఎప్పుడూ గ్యాస్ ఉండి, మలబద్ధకంతో బాధపడేవారు ఆహారంలో కొన్ని మార్పులు చేయాలి. వీరు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలని ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో వోట్మీల్, బార్లీ, బఠానీలు, బీన్స్, కాయధాన్యాలు, నిమ్మకాయలు, యాపిల్స్ ఉంటాయి.

బాదం, బెర్రీలు తప్పనిసరిగా తినాలి

ఇది కాకుండా గ్యాస్ సమస్యని నివారించాలంటే బాదంని డైట్‌లో చేర్చాలి. బెర్రీలు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి కడుపుని క్లీన్‌ గా ఉంచుతాయి. ఎండాకాలం దోసకాయని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి