Common Cold: చలికాలం వచ్చేస్తోంది.. జలుబు రాకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు ఏమిటంటే..

|

Nov 01, 2021 | 3:25 PM

Common Cold: శీతాకాలం వస్తుందంటే సర్వసాధారణంగా జలుబు బారినపడేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. ముక్కు కారటం, తలనొప్పి, శరీర నొప్పి , గొంతునొప్పి..

Common Cold: చలికాలం వచ్చేస్తోంది.. జలుబు రాకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు ఏమిటంటే..
Common Cold
Follow us on

Common Cold: శీతాకాలం వస్తుందంటే సర్వసాధారణంగా జలుబు బారినపడేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. ముక్కు కారటం, తలనొప్పి, శరీర నొప్పి , గొంతునొప్పి వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. దీంతో రోజువారీ పనులు చేసుకోవడానికి కూడా అసౌకర్యం ఫీల్ అవుతాం. జలుబు నుంచి ఉపశమనంకోసం కొంచెం వేడి వేడి పానీయాలు తాగడం.. తో పాటు చల్లటి వాటికీ దూరంగా ఉండాల్సి ఉంది.   అంతేకాదు జలుబు తో ఇబ్బంది పడేవారు ఉపశమనం కోసం మాత్రలు వేసుకోవడం , ఆవిరి పట్టడం చేస్తారు. అయితే జలుబు, ముక్కు కారడం వంటి వాటితో వచ్చిన తర్వాత ఇబ్బంది పడే బదులు జలుబు రాకుండా ముందుగా ఫిట్ గా యాక్టివ్ గా ఉండేందుకు కొన్ని సింపుల్ చిట్కాలు మీకోసం

చేతులను తరచుగా శుభ్రంగా చేసుకోవడం

కరోనా మహమ్మారి నివారణ కోసం చేతులను తరచుగా శుభ్రంగా చేసుకోవడం నేర్పింది. దీనినే చలికాలం కూడా కొనసాగించాలి. జలుబుని వ్యాపింపజేసే వైరస్‌లు.. జలుబు సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా వ్యాపిస్తాయి.  ఇవి 24 గంటల పాటు చేతులు , ఉపరితలాలపై జీవిస్తాయి. కాబట్టి, అనారోగ్యం బారిన పడకుండా ఉండటానికి, తినడానికి లేదా మీ ముఖాన్ని తాకడానికి ముందు మీ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.

రోజు తగినంత నీరు తాగడం: 

సాధారణంగా శీతాకాలంలో.. నీరు తాగడం తగ్గుతుంది. చల్లటి వాతావరణం వల్ల దాహం వేయదు. కనుక ఎక్కువగా నీటిని తాగలేము. అయితే చలికాలంలో కూడా తగినంత నీరు తాగాల్సి ఉంటుంది. ఎందుకంటే నీరు శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపి అనారోగ్యం బారిన పడకుండా చేస్తుంది. కనుక మీరు ఆరోగ్యంగా ఉండలనుకునే వారు రోజుకు కనీసం 2 లీటర్ల నీరు త్రాగాలి. శరీరంలో నీటి స్థాయిలను పెంచుకోవడానికి వేడి వేడి సూప్, జ్యుస్ లు వంటివి తాగవచ్చు.

సమతుల్య ఆహారం

సీజన్‌లో ఆరోగ్యాన్ని ఇచ్చే సమతుల్య ఆహారం తీసుకోండి. శరీరానికి పోషకాలను పుష్కలంగా అందిస్తుంది. అంతేకాదు  ఫిట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.  చలికాలంలో జింక్ , విటమిన్ డి ఉండే ఆహారపదార్ధాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఈ రెండు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వ్యాధి నిరోధకంగా సహాయపడతాయి. ఆకు కూరలు, తృణధాన్యాలు, గింజలు , పండ్లు ఎక్కువగా తినండి.

తగినంత నిద్ర: 

జలుబుతో పోరాడటానికి , నిరోధించడానికి శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం.. దీనిని తగినంత నిద్ర పోవాల్సి ఉంది.  నిద్రలేమితో ఇబ్బంది పడేవారు త్వరగా ఇన్‌ఫెక్షన్‌ బారినపడతారు. అందుకనే రాత్రి సాయంలో తగినంత నిద్రపోయినవారికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మనం రాత్రిసాయంలో నిద్రపోయేవారి శరీరంలో సైటోకిన్‌లు, ఇన్ఫెక్షన్   ఇన్‌ఫ్లమేషన్‌ను లక్ష్యంగా చేసుకునే ప్రొటీన్‌ల ఉత్పత్తి చేస్తుంది. కనుక రోగనిరోధక వ్యవస్థను చురుకుగా ఉంచడానికి ప్రతిరోజూ 7 నుండి 8 గంటలు నిద్రపోయేలా చూసుకోవాల్సి ఉంది.

వ్యాయామం

వ్యాయామం అనేది శరీరంలోని బరువు తగ్గడానికి లేదా కండరాలను నిర్మించడానికి మాత్రమే కాదు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి , జలుబును నివారించడానికి కూడా సహాయపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కనుక  వ్యాయామం చేయడం వల్ల  రోగనిరోధక కణాలు శరీరం చుట్టూ మరింత వేగంగా ప్రయాణించడంలో సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కనుక శీతాకాలంలో నడక, యోగా, మెడిటేషన్, రన్నింగ్ వంటి సాధారణ వ్యాయామాన్ని రెగ్యులర్ చేయడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Also Read:  హీరోయిన్ అవ్వాలనుకుని.. డ్యాన్సార్‌గా వెండి తెరపై అడుగు పెట్టి.. ఆంధ్రుల గుండమ్మత్తగా మారిన వైనం..