Liver Cirrhosis: లివర్ సిర్రోసిస్ అంటే ఏమిటి.. దాని లక్షణాలను ఎలా గుర్తించాలో తెలుసుకోండి

|

Jul 05, 2022 | 5:39 PM

ఎంజైమ్‌లను కూడా తయారు చేస్తుంది. కాలేయం విటమిన్లు, కొవ్వు వంటి ఇతర పోషకాలను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. చక్కెర, పోషకాలను నిల్వ చేస్తుంది. ఇది ఇన్ఫెక్షన్‌తో పోరాడడంలో కూడా సహాయపడుతుంది.

Liver Cirrhosis: లివర్ సిర్రోసిస్ అంటే ఏమిటి.. దాని లక్షణాలను ఎలా గుర్తించాలో తెలుసుకోండి
Fatty Liver
Follow us on

లివర్ సిర్రోసిస్ అనేది కాలేయం క్రమంగా క్షీణించే వ్యాధి. కాలేయం మన శరీరంలోని రెండవ అతి ముఖ్యమైన అవయవం.. ఇది మన శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. ఎంజైమ్‌లను కూడా తయారు చేస్తుంది. కాలేయం విటమిన్లు, కొవ్వు వంటి ఇతర పోషకాలను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. చక్కెర, పోషకాలను నిల్వ చేస్తుంది. ఇది ఇన్ఫెక్షన్‌తో పోరాడడంలో కూడా సహాయపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం కాలేయంలో ఏదైనా లోపం ఉన్నప్పుడు. అది తనను తాను సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. లివర్ సిర్రోసిస్ అనేది కాలేయానికి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధి.. అలా అని ఇది వెంటనే అభివృద్ధి చెందదు. ఈ వ్యాధి కాలేయంలో కొవ్వు పేరుకుపోవడంతో ప్రారంభమవుతుంది. ఇలా కొవ్వు వల్ల కాలేయం దెబ్బతినడాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. లివర్ సిర్రోసిస్ వ్యాధికి ప్రధాన కారణాలు స్థూలకాయం, వైరల్ హెపటైటిస్‌తో బాధపడటం, మధుమేహ వ్యాధి, డ్రగ్స్ , ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం. ఈ వ్యాధి లక్షణాలను సకాలంలో అర్థం చేసుకుంటే పెద్ద ఇబ్బందులను నివారించవచ్చు. లివర్ సిర్రోసిస్ అంటే ఏమిటి..? దాని లక్షణాలను ఎలా నివారించవచ్చో తెలుసుకుందాం..

లివర్ సిర్రోసిస్ అంటే ఏమిటి?

లివర్ సిర్రోసిస్ అనేది ఫైబ్రోసిస్ యొక్క క్షీణించిన స్థితి, ఇక్కడ చిన్న సమస్యల వల్ల కాలేయ కణజాలం దెబ్బతింటుంది. ఒక వ్యక్తికి ఒకసారి ఫ్యాటీ లివర్ సమస్య వస్తే, ఆ తర్వాత లివర్ సిర్రోసిస్ సమస్య మొదలవుతుంది. ఈ సమస్య అభివృద్ధి చెందడానికి దాదాపు 10 సంవత్సరాలు పడుతుంది.

ఈ సమయంలో, కాలేయంలో ఏదైనా గాయం లేదా వాపు ఉంటే, దీని కారణంగా కాలేయ ఫైబ్రోసిస్ సమస్య ఉంటుంది. లివర్ ఫైబ్రోసిస్ అనేది ఫ్యాటీ లివర్ యొక్క తదుపరి దశ. సిర్రోసిస్ తర్వాత పరిస్థితి చాలా కష్టం అవుతుంది. ఈ వ్యాధి యొక్క అనేక లక్షణాలు ఉన్నాయి, వీటిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. శరీరంలో లివర్ సిర్రోసిస్ యొక్క ప్రారంభ లక్షణాలను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

లివర్ సిర్రోసిస్ లక్షణాలు: నిరంతరం అలసిపోవడం, చర్మంపై మచ్చలు, ఆకలి లేకపోవడం, సెక్స్ డ్రైవ్ తగ్గడం, మహిళల్లో పీరియడ్స్ సక్రమంగా లేకపోవడం, గాయం తర్వాత రక్తస్రావం కావడం, వేగంగా బరువు తగ్గడం.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)