Child Care Tips: మీ పిల్లలు చిన్న విషయాలకే చిరాకు పడుతున్నారా? వారికి ఈ సమస్య ఉండొచ్చు..!

చిన్న పిల్లలు చాలా అల్లరి చేస్తుంటారు. ఉన్నచోట ఉండకుండా విసుగెత్తిస్తుంటారు. అయితే, కొందరు పిల్లలు మాత్రం ప్రతిదానికి చిరాకు పడుతుంటారు. అకస్మాత్తుగా వారికి కోపం వస్తుంటుంది. ఇలాంటి సమస్యే మీ పిల్లలు ఎదుర్కొంటున్నట్లయితే..

Child Care Tips: మీ పిల్లలు చిన్న విషయాలకే చిరాకు పడుతున్నారా? వారికి ఈ సమస్య ఉండొచ్చు..!
Child Health Care Tips

Updated on: Jun 25, 2023 | 12:19 PM

చిన్న పిల్లలు చాలా అల్లరి చేస్తుంటారు. ఉన్నచోట ఉండకుండా విసుగెత్తిస్తుంటారు. అయితే, కొందరు పిల్లలు మాత్రం ప్రతిదానికి చిరాకు పడుతుంటారు. అకస్మాత్తుగా వారికి కోపం వస్తుంటుంది. ఇలాంటి సమస్యే మీ పిల్లలు ఎదుర్కొంటున్నట్లయితే.. వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. పిల్లలు ఇలా ప్రవర్తించడానికి వారి శరీరంలో విటమిన్ లోపం కారణమై ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విటమిన్ బి 12 లోపానికి ఇది సంకేతం అని చెబుతున్నారు. శారీరక ఆరోగ్యం, నరాల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఈ విటమిన్ చాలా అవసరం. శరీరంలో విటమిన్ బి12 లోపిస్తే అది పిల్లల ప్రవర్తనపై ప్రభావితం చూపుతుంది. దీని కారణంగా వారు పదే పదే చిరాకుపడతారు. పిల్లలు తినే ఆహారంపై శ్రద్ద వహించకపోవడం, కొన్ని సందర్భాల్లో జన్యుపరమైన కారణాల వల్ల కూడా విటమిన్ బి12 లోపం ఉంటుంది. పిల్లల్లో విటమిన్ బి12 లోపం ఎందుకు వస్తుంది? దాని లక్షణాలు ఏంటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం..

విటమిన్ బి12 లోపం వల్ల నరాల సంబంధిత సమస్యలు..

ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ రాజేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. విటమిన్ బి12 లోపం వల్ల నరాల ఆరోగ్యం ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా వారు నిరంతరం అలసిపోవడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ విటమిన్ లోపం కారణంగా కొంతమంది పిల్లలు చిరాకుపడతారు. ఈ లక్షణాలు మీ పిల్లల్లో కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

విటమిన్ బి12 లోపానికి కారణాలు..

సరైన పోషకాలు ఉన్న ఆహారాన్ని తినకపోవడం వల్ల విటమిన్ బి12 లోపం వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇది జన్యూపరమైన కారణాల వల్ల కూడా వస్తుందని చెబుతున్నారు. మీ పిల్లల్లో విటమిన్ లోపం ఉందని మీరు భావిస్తే.. రక్త పరీక్ష చేయించొచ్చు. ఒకవేళ విటమిన్ల లోపం ఉంటే.. వైద్యులు అవసరమైన మందులు ఇస్తారు.

ఇవి కూడా చదవండి

విటమిన్ బి12 లోపాన్ని ఎలా భర్తీ చేయాలి…

పిల్లల్లో బి12 విటమిన్ లోపాన్ని భర్తీ చేయాలంటే వారు తినే ఆహారం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పాలు, గుడ్లు, చేపలను పిల్లలకు తినిపించాలి. నాన్‌వెజ్ తినకపోతే.. సీజన్‌లో లభించే ఆకు కూరగాయలు, పండ్లను తినిపించాలి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలు వైద్యుల సూచనల మేరకు ఇవ్వడం జరిగింది. పిల్లలకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..