Child Care Tips: మీరు కొత్తగా తల్లి అయినట్లయితే పిల్లల సంరక్షణ కోసం ఈ చిట్కాలు తెలుసుకోండి..!

|

Feb 18, 2022 | 11:20 AM

Child Care Tips:ఒక స్త్రీ బిడ్డకు జన్మనిస్తే ఆమెలో మాతృత్వ లక్షణాలు వస్తాయని అంటారు. పగలు, రాత్రి తన నిద్ర, ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా బిడ్డను కాపాడుకుంటుంది. కానీ చిన్న పిల్లవాడిని..

Child Care Tips: మీరు కొత్తగా తల్లి అయినట్లయితే పిల్లల సంరక్షణ కోసం ఈ చిట్కాలు తెలుసుకోండి..!
Follow us on

Child Care Tips:ఒక స్త్రీ బిడ్డకు జన్మనిస్తే ఆమెలో మాతృత్వ లక్షణాలు వస్తాయని అంటారు. పగలు, రాత్రి తన నిద్ర, ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా బిడ్డను కాపాడుకుంటుంది. కానీ చిన్న పిల్లవాడిని చూసుకోవడం అంత తేలికైన విషయం కాదు. ప్రత్యేకించి మీరు కొత్తగా తల్లి అయినట్లయితే, మీ చుట్టూ పెద్దలు లేకుంటే మీరు చాలా విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంతకు ముందు మీకు పిల్లల సంరక్షణ (Child Care) విషయంలో అనుభవం ఉండదు కాబట్టి చాలా విషయాలు తెలుసుకోవడం మంచిది. పిల్లలు పుట్టిన తర్వాత ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల విషయంలో అంతకు ముందు మీకు అనుభవం ఉంటే పర్వాలేదు. కానీ కొత్తగా తల్లి అయిన తర్వాత నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. పిల్లలు ఎప్పుడు ఏడుస్తారో తెలియని పరిస్థితి ఉంటుంది. వారికి ఏ నోప్పి వచ్చినా.. ఆకలి వేసినా ఏడవడం తప్ప.. నోటితో చెప్పడం అనేది ఉండదు. పిల్లల సంరక్షణ విషయంలో తల్లే అన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే పెద్దల సలహాలు తీసుకోవాలి.  మీకు కొన్ని సులభమైన శిశువు సంరక్షణ చిట్కాలను అందిస్తున్నాము.

► చిన్న పిల్లల రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందదు కాబట్టి త్వరలో వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది. అందువల్ల తల్లి పిల్లలను ఒడిలోకి తీసుకునేటప్పుడు శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పిల్లవాడు ఎక్కువగా తల్లికి దగ్గరగా ఉంటాడు కనుక తల్లి పిల్లల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

► పిల్లవాడిని ఒడిలోకి తీసుకోవడానికి సరైన మార్గాన్ని నేర్చుకోవాలి. లేకపోతే పిల్లల మెడ భాగంలో సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. పిల్లవాడిని ఒడిలో పట్టుకుని, అతని తలను, వెన్నెముకను మద్దతుతో ఎత్తుకోండి. మీ ఒడిలో ఉన్న బిడ్డను కదిలించడం అలవాటు చేసుకోకండి. లాలించండం నేర్చుకోండి.

► పిల్లలకు వేసే డైపర్ 4 నుండి 5 గంటలలోపు మార్చాలి. ఎక్కువ సేపు డైపర్లు ధరించడం వల్ల శిశువుకు ఇన్ఫెక్షన్, అలెర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. డైపర్ మార్చేటప్పుడు ఆ భాగాన్ని కాటన్, నీటితో శుభ్రం చేసి టవల్‌తో తుడవండి. దీని తరువాత కొద్దిగా నూనెను రాయడం వల్ల దద్దుర్లు రాకుండా ఉంటుంది.

► నవజాత శిశువుకు ఫీడ్, నిద్ర రెండూ అవసరం. సమయానుకూలంగా ఎక్కువసేపు నిద్రపోయేలా చేయాలి. పిల్లలకు ఎంత నిద్ర ఉంటే అంత మంచిది.

ఇవి కూడా చదవండి:

Health Tips: ఉదయం లేవగానే ఫోన్ చూస్తున్నారా ? అయితే ప్రమాదమే అంటున్న నిపుణులు..

Health Tips: ఎముకలలో నొప్పి వస్తుందా.. అయితే ఈ లక్షణం కావొచ్చు.. జాగ్రత్త పడకుంటే తీవ్ర పమాదం..