Variety Mask: ఇదేం మాస్క్ సామీ.. ఇలా ఉంది..? ఈ మాస్క్ పెట్టుకొని తినొచ్చు ఎలానో చూడండి.. వీడియో.
కరోనా వైరస్ ముక్కుద్వారానే శ్వాసవ్యవస్థలోకి ప్రవేశిస్తుందని చాలా అధ్యయనంలో వెల్లడైంది. దీంతో ముక్కు కవర్ అయ్యే విధంగా మాస్క్ వాడుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాస్క్‌ను తీయకూడదని సూచిస్తున్నారు వైద్యులు. ఇలా మాస్క్ ధరించిన సమయంలో..
కరోనా వైరస్ ముక్కుద్వారానే శ్వాసవ్యవస్థలోకి ప్రవేశిస్తుందని చాలా అధ్యయనంలో వెల్లడైంది. దీంతో ముక్కు కవర్ అయ్యే విధంగా మాస్క్ వాడుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాస్క్‌ను తీయకూడదని సూచిస్తున్నారు వైద్యులు. ఇలా మాస్క్ ధరించిన సమయంలో.. ఆహారం తినాలన్న లేదా నీరు తాగాలన్న ఖచ్చితంగా మాస్క్ తీయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియాకు చెందిన ఆత్మన్ అనే సంస్థ కేవలం ముక్కును మాత్రమే మూసి ఉంచేలా ఓ మాస్క్‌ను రూపొందించింది. ఈ యాంటీ వైరల్ మాస్క్ కు కోస్క్ పేరును కూడా ఫిక్స్ చేసింది.కో అంటే కొరియా భాషలో ముక్కు అనే అర్ధం. దీంతో ఈ వెరైటీ మాస్క్ కు కోస్క్ అనే పేరును పెట్టారు. ఇకపై తినే సమయంలోనూ, నీరు తాగే సమయంలోనూ మాస్క్ తీయాల్సిన అవసరం లేదని ఆత్మన్ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఈ మాస్క్ ను ఆన్ లైన్ లో అమ్ముతున్నారు. అయితే ముక్కుని మాత్రమే మూసి ఉంచే ఈ కొత్త రకం మాస్కుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మాస్కు సూపర్ గా ఉందని కొందరు ప్రశంసిస్తుంటే..మరికొందరు మాత్రం ఈ తరహా మాస్కులు కల్పించే భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ: Sai pallavi vs Teddy Bears: నేచురల్ బ్యూటీ ‘సాయి పల్లవి’తో పోటీ పడుతున్న ‘టెడ్డీ బేర్స్’.! కలర్స్‌లో తగ్గేదే లే.. వైరల్ అవుతున్న ఫొటోస్..