Diaper: మీ పిల్లలకు డైపర్లు వాడుతున్నారా.. అయితే ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే..

ఈ రోజుల్లో డైపర్ల వాడకం భారీగా పెరిగింది. అయితే డైపర్లు ఎలాపడితే అలా వాడితే పిల్లలకు చర్మ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మరి డైపర్ ఎలా వాడాలి..

Diaper: మీ పిల్లలకు డైపర్లు వాడుతున్నారా.. అయితే ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే..
Daipar

Updated on: Oct 08, 2021 | 10:25 PM

ఈ రోజుల్లో డైపర్ల వాడకం భారీగా పెరిగింది. అయితే డైపర్లు ఎలాపడితే అలా వాడితే పిల్లలకు చర్మ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మరి డైపర్ ఎలా వాడాలి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకోండి.

బట్టతో చేసినవి, డిస్పోజబుల్ డైపర్లు అందరూ వాడుతుంటారు. వీటిలో ఏది మంచిదో ఇప్పుడు చూద్దాం.. బట్టతో చేసినవి వాడితే విసర్జించిన మలమూత్రాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. డిస్పోజబుల్‎​కు డైపర్లు వాడితే పర్యావరణానికి తీవ్ర హానిచేస్తాయి. ఇప్పుడు మనకు ఏం అర్థమవుతుంది బట్టతో చేసిన డైపర్ల వాడకమే ఉత్తమం. బట్టతో చేసిన డైపర్లో వాటర్​ ప్రూఫ్​ ఉన్న ప్లాస్టిక్‎ను వాడితే బాగుటుంది. బట్టతో చేసిన డైపర్లను ఇతర బట్టలతో కలపకుండా వేడినీటిలో ఉతకాలి.

పిల్లలు మల విసర్జన చేసిన డైపర్లను అలాగే బయటపడేయకూడదు. యూరిన్​ చేసిన తర్వాత తొందరగా డైపర్ మార్చాలి. లేదంటే చర్మంపై ఇన్​ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది. డైపర్​ వేయడానికి ముందు పౌడర్ వేయాలనుకుంటే.. చేతితో వేయకూడదు. డిస్పోజబుల్​ డైపర్​ వాడితే పిల్లలకు టాయిలెట్ ట్రైనింగ్ కాస్త ఆలస్యం అవుతుందని అనుకుంటారు కానీ ఇది నిజం కాదు.

Read Also.. Kidney Health Tips: కిడ్నీల్లోని వ్యర్ధాలు బయటకు వెళ్లి ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజు ఒక్కసారైనా ఈ ఔషధాన్ని తాగండి..