మీరు చికెన్ ఎక్కువగా తింటున్నారా..? మీకు ఈ విషయాలు తెలుసా..?

చికెన్ ప్రోటీన్ కోసం చూస్తున్న వాళ్లకు బెస్ట్ ఆప్షన్‌. ఇప్పుడు డైట్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరి ప్లాన్‌లో ఇది తప్పనిసరిగా ఉంటుంది. అయితే చికెన్‌లోని అన్ని భాగాల్లో ఒకేలా ప్రోటీన్ ఉండదని మీకు తెలుసా..? ఏ ముక్కలో ఎంత ప్రోటీన్ ఉందో ఇప్పుడే తెలుసుకోండి.

మీరు చికెన్ ఎక్కువగా తింటున్నారా..? మీకు ఈ విషయాలు తెలుసా..?
How Much Protein In 100 Gms Chicken

Updated on: Apr 11, 2025 | 8:39 PM

ఇప్పటి ఫిట్‌ నెస్ ట్రెండ్‌ లలో ఎక్కువగా వినిపించే పేర్లలో ఒకటి చికెన్‌. హెల్తీ డైట్ ప్లాన్‌ లో ఇది తప్పకుండా ఉంటుంది. బాడీ బిల్డింగ్ చేస్తున్నవాళ్లైనా, వెయిట్ లాస్ లక్ష్యంతో ఉన్నవారైనా.. ఎక్కువ ప్రోటీన్‌ అవసరమయ్యే ప్రతి ఒక్కరికీ చికెన్ ఓ బెస్ట్ ఆప్షన్ గా ఉంది. నాన్‌ వెజ్‌ ప్రియులకు మాత్రమే కాదు ఆరోగ్యంపై దృష్టి పెట్టే అందరికీ ఇది మంచి ఆప్షన్‌. తక్కువ కొవ్వుతో అధిక ప్రోటీన్‌ లెవల్స్‌ తో శరీరానికి అవసరమైన ఎనర్జీని అందించడంలో ఇది టాప్ లో ఉంటుంది.

ప్రతి ఒక్కరికీ తెలియాల్సిన విషయం ఏమిటంటే.. చికెన్‌లోని అన్ని భాగాల్లో ఒకే రకంగా ప్రోటీన్ ఉండదు. కొన్ని భాగాల్లో ప్రోటీన్ అధికంగా ఉంటే మరికొన్ని భాగాల్లో తక్కువగా ఉంటుంది. అందుకే ఏ భాగాన్ని ఎంచుకోవాలో ముందే తెలుసుకోవాలి. చికెన్‌లో ఉండే ప్రోటీన్ మోతాదును అంచనా వేయాలంటే 100 గ్రాముల మాంసాన్ని స్టాండర్డ్‌ గా తీసుకుంటారు. అయితే అది ఎముకలు, చర్మం లేకుండా ఉండాలి. ఎందుకంటే చర్మం, ఎముకలు ఉండిపోయినట్లయితే అసలు మాంసం మీద లెక్క వేయడం కష్టంగా ఉంటుంది. ఎముకలు లేకుండా చర్మం తీసేసిన మాంసంలో మాత్రమే ఖచ్చితమైన ప్రోటీన్ పరిమాణం లెక్కించడం సాధ్యమవుతుంది.

చికెన్ బ్రెస్ట్ అనేది చికెన్‌లో అత్యంత లీన్ మీట్‌గా పరిగణించబడుతుంది. ఇందులో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది కానీ ప్రోటీన్ మాత్రం ఎక్కువగా లభిస్తుంది. అందుకే ఎక్కువ మంది డైట్‌లో ఈ భాగానికి మొదట ప్రాధాన్యత ఇస్తారు. 100 గ్రాముల బ్రెస్ట్ ముక్కలో సుమారు 31 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది మసిల్ బిల్డింగ్ లక్ష్యాలకు అనుకూలంగా ఉంటుంది. ఇక చికెన్ కాళ్ల భాగం అంటే డ్రమ్‌స్టిక్‌ టేస్టీగా ఉండే ముక్క. ఇందులో కొవ్వు కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా మంచి ప్రోటీన్ లభిస్తుంది. 100 గ్రాముల డ్రమ్‌స్టిక్‌లో సుమారు 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది మృదువుగా ఉండటం వల్ల చాలా మంది దీన్ని ఫ్రై చేయడం లేదా గ్రిల్ చేయడానికి ఇష్టపడుతారు.

ఇంకా కొంతమంది ఇష్టపడే ముక్కలలో చికెన్ లెగ్ కూడా ఒకటి. ఇది భుజం నుంచి మోకాలి వరకు ఉండే భాగం. ఇందులో మాంసం తినడానికి బాగా ఉంటుంది. 100 గ్రాముల లెగ్ ముక్కల్లో సుమారు 28.3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది కూడా మంచి ఎంపికే. ఇక చిన్నవైనప్పటికీ చాలా మందికి బాగా ఇష్టమైన చికెన్ రెక్కల్లోనూ మంచి మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. అవి సైజ్ పరంగా చిన్నవైనా పోషకాల విషయానికి వస్తే.. 100 గ్రాముల చికెన్ రెక్కల్లో సుమారు 30.5 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అందుకే చాలా మంది వీటిని బార్బిక్యూ చేయడం, ఫ్రై చేయడానికి ఇష్టపడతారు.

చికెన్ ఆరోగ్యానికి ప్రోటీన్ పుష్కలంగా అందించే ఆహారం. అయితే దాన్ని ఎలా తినాలి ఏ భాగాన్ని తీసుకోవాలి అనేది పూర్తిగా మన ఆరోగ్య లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే బ్రెస్ట్ ముక్కలు ఎంచుకోవచ్చు. టేస్ట్ కోసం చూస్తే రెక్కలు, డ్రమ్‌స్టిక్‌, లెగ్ ముక్కలు మంచి ఎంపికలుగా చెప్పవచ్చు. సరైన భాగాన్ని ఎంచుకుని మితంగా తీసుకుంటే చికెన్ ఆరోగ్యానికి చాలా మంచిది.