Human Skin: ఇది మీకు తెలుసా.. మీ శరీరం నుండి వచ్చే సువాసన వ్యాధులను వ్యాపించే దోమలను ఆకర్షిస్తాయట..

|

Sep 23, 2022 | 6:20 PM

అవును ఇది నిజమే.. వ్యాధులను వ్యాపించే దోమలు మిమ్మల్ని కుడుతున్నాయంటే దానికి ఒక కారణం ఉందంటున్నారు పరిశోధకులు. అది మీ శరీరం నుంచి వచ్చే స్మెల్‌ అనేక వ్యాధులను వ్యాపించే దోమలను ఆకర్షిస్తాయట.

Human Skin: ఇది మీకు తెలుసా.. మీ శరీరం నుండి వచ్చే సువాసన వ్యాధులను వ్యాపించే దోమలను ఆకర్షిస్తాయట..
Mosquitoes
Follow us on

Human Skin Fragrance : ప్రతి ఊరు, ప్రతి ఇంటిలోనూ ఉండే ప్రధాన సమస్య..దోమలు.. ఇక వర్షాకాలం వచ్చిందంటే..చెవి దగ్గర అవి చేసే గోలే కాదు.. దోమలు పంచే రోగాలు కూడా అన్నీ ఇన్నీ కావు. కొన్ని ప్రాంతాల్లో అయితే, కుప్పలు తెప్పలుగా ఈగ సైజులో ఉండే దోమలు కూడా జనాల్ని పీక్కుతుంటుంటాయంటే నమ్మాల్సిందే. దోమకాటుతో డెంగ్యూ, టైఫాయిడ్ లాంటి ప్రాణాంతక వ్యాధులతో ప్రజలు తరచూ ఆస్పత్రి పాలవుతుంటారు. ఇంకా జికా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్ వంటి వ్యాధులకు కారణం దోమలు.. దోమకాటు ద్వారానే ఇలాంటి వ్యాధులు విపరీతంగా వ్యాప్తి చెందుతాయి. అయితే దీనికి కారణం మానవ చర్మం నుంచి వచ్చే సువాసనే అంటున్నారు పరిశోధకులు.

అవును ఇది నిజమే.. వ్యాధులను వ్యాపించే దోమలు మిమ్మల్ని కుడుతున్నాయంటే దానికి ఒక కారణం ఉందంటున్నారు పరిశోధకులు. అది మీ శరీరం నుంచి వచ్చే స్మెల్‌ అనేక వ్యాధులను వ్యాపించే దోమలను ఆకర్షిస్తాయని చెబుతున్నారు. మీ శరీరం నుంచి వచ్చే సువాసనలు వాటిని ఎట్రాక్ట్‌ చేస్తాయని పేర్కొన్నారు. జికా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్‌ వైరస్‌ల వాహకాలుగా పనిచేసే దోమలను ఆకర్షిస్తాయని వెల్లడించారు. మీ స్కిన్ నుంచి వచ్చే స్మెల్ ఆ వ్యాధులను వ్యాప్తి చేసే దోమలను ఎట్రాక్ట్ చేస్తుందట. UC రివర్‌సైడ్ పరిశోధనలు ఈ విషయాన్ని వెల్లడించాయి. బాధితుడిని నుంచి వచ్చే కార్బన్ డయాక్సైడ్, 2-కెటోగ్లుటారిక్, లాక్టిక్ ఆమ్లాల సమ్మేళనాల వాసన ద్వారా దోమలు ఆ వ్యక్తులను కుడతాయంటున్నారు.

UC రివర్‌సైడ్ నేతృత్వంలోని పరిశోధన ప్రకారం.. దోమను గుర్తించడానికి, అది బాధితునిపై దాడి చేయడానికి ప్రేరేపించే వాసన కార్బన్ డయాక్సైడ్ మరియు 2-కెటోగ్లుటారిక్ మరియు లాక్టిక్ ఆమ్లాల సమ్మేళనాల మిశ్రమం ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఈ రసాయన సమ్మేళనం ప్రోబింగ్‌ని కూడా ప్రోత్సహిస్తుంది. ఈ రసాయన సమ్మేళనం ఆడ ఈడిస్ ఈజిప్టి దోమల్లో ఎక్కువగా కనుగొన్నారు. ఇది జికా, చికున్‌గున్యా , డెంగ్యూ ఎల్లో ఫీవర్ వైరస్‌ల వాహకాలుగా కనిపిస్తుంది. ఈ ఆడ ఈడిస్‌ ఈజిప్టి దోమలను మొదట ఆఫ్రికాలో కనుగొన్నారు. ఆ తర్వాత ఈ దోమలు US సహా అనేక దేశాలకు వేగంగా వ్యాపించినట్టు పరిశోధకులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి