అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, డయాబెటీస్ ఉన్నావారికి గుండెపోటు వచ్చే అవకాశం మెండుగా ఉంది. ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి శారీరక శ్రమ చాలా ముఖ్యమని అధ్యయనంలో తేలింది. అలాగే హార్ట్ పేషెంట్లు కూడా రోజూ ఫిజికల్ ఎక్సర్ సైజ్ చేస్తే చాలా మంచిది. రోజూ తప్పనిసరిగా మార్నింగ్ లేదా ఈవినింగ్ వాకింగ్ చేస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
నడక, రోజూ ఉదయం వ్యాయామం చేసే వారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం తక్కువగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా హార్ట్ పేషెంట్లు ముందుగా వైద్యుల సహా తీసుకుని ఆ తర్వాతే ఏదైనా వ్యాయామం చేయడం మొదలు పెట్టాలి. ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు మీరు ఏ వ్యాయామం చేయడం మంచిదో సూచిస్తారు. పనులు కూడా వైద్యుల సహా మేరకు మాత్రమే చేయాలి.
-వ్యాయామం రక్త పోటును తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా తగ్గించి, డయాబెటీస్ ని అదుపులో ఉంచుతుంది.
-రోజూ ఉదయం ఏరొబిక్స్ చేయడం వల్ల దీని వల్ల ఊపిరితిత్తులు రెండూ బాగా పనిచేస్తాయి. గుండె రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. కానీ, ఇందులో క్లిష్టమైన ఆలనాల జోకి వెళ్లకుండా ఉంటేనే బెటర్.
-అలాగే స్విమ్మింగ్ చేయవచ్చు.. కానీ ఎక్కువ ఒత్తిడి రాకుండా చూసుకోవాలి. వారానికి 3–4 సార్లు ఏదైనా తేలికపాటి వ్యాయామం చేయాలి.
-ఏదైనా వ్యాయామం చేసే ముందు వార్మ్ అప్ చాలా ముఖ్యం. వ్యాయామం తరువాత కూడా కాస్త సమయం కూల్ అవ్వడానికి కేటాయించాలి.
ఇక ఏదైనా వ్యాయామం చేసినప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే.. తలనొప్పి, ఛాతినొప్పి, మైకం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే.. వెంటనే వ్యాయామం చేయడం ఆపేయాలి. తక్షణమే వైద్యులను సంప్రదించడం మేలు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..