Weak Bones Reasons: మన శరీరాన్ని బలంగా ఉంచుకోవాలంటే, ఎముకలు దృఢంగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ, వయస్సు పెరిగేకొద్దీ ఎముకలు బలహీనపడటం ప్రారంభమవుతుంది. ఎందుకంటే 35 నుంచి 40 సంవత్సరాల వయస్సు తర్వాత శరీరంలో కాల్షియం తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది శరీరంలోని ఎముకలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఎముకలు, దంతాలు క్రమంగా బలహీనపడుతాయి. ఈ సమస్య రాకుండా ఉండాలంటే మనం రోజూ తీసుకునే ఆహారంలో క్యాల్షియంతో పాటు విటమిన్ డి కూడా ఉండాలి. అప్పుడే శరీర నొప్పులు, ఎముకలు బలహీనంగా మారకుండా కాపాడుకోవచ్చు. ఎముకలు బలహీనపడటానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ అలవాట్లతో ఎముకలు బలహీనమవుతాయి
తరచుగా రెడ్ మీట్ ఎక్కువగా తినేవారిలో వారి శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ప్రొటీన్లు అందడం మొదలవుతుంది. దాని వల్ల ఎసిడిటీ సమస్య తలెత్తుతుంది. విసర్జన సమయంలో చాలా కాల్షియం శరీరం నుంచి బయటకు వస్తుంది. కాబట్టి పరిమిత పరిమాణంలో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోండి.
శీతల పానీయాలు, సోడా వంటి కార్బోనేటేడ్ పానీయాలను ఎక్కువగా తీసుకునే వ్యక్తులు వీక్ బోన్ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇటువంటి పానీయాలలో కాల్షియం తగ్గించే ఎక్కువ ఫాస్ఫేట్ ఉంటుంది. శీతల పానీయాలతో ఎముకలు క్రమంగా బలహీనపడతాయి.
కొందరు ఎసిడిటీ మందులను ఎక్కువగా తీసుకుంటారు. వారు దానిని ఆపితే మంచిదంటున్నారు నిపుణులు. ఈ మందులు కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలపై ప్రభావం చూపి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
ఎముకలను దృఢంగా ఉంచుకోవాలనుకుంటే టీ-కాఫీని తీసుకోవడం తగ్గించండి. ఎందుకంటే అందులో ఉండే క్యాపిన్ ఎముకలపై ప్రభావం చూపుతుంది. అలాంటి వారికి కెఫిన్ ముప్పుగా మారుతుంది.