
ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. బరువు తగ్గాలనుకుంటే కేవలం వ్యాయామం చేయడమే కాదు.. మనం తినే ఆహారం పట్ల కూడా శ్రద్ధ పెట్టాలి. సహజ పద్ధతులు, సహజ పదార్థాలతో బరువు తగ్గడం ఆరోగ్యకరమైన మార్గం. అలాంటి సహజ మార్గాలలో క్యారెట్ జ్యూస్ ఒకటి.
క్యారెట్ పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్ తో పాటు, అధికంగా ఫైబర్ కూడా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి వేగంగా పని చేసేలా చేస్తుంది. దీని వల్ల శరీరంలోని వ్యర్థాలు తొలగిపోయి, శరీరం శుభ్రంగా మారుతుంది.
రోజూ క్యారెట్ జ్యూస్ తాగితే ఆకలి తగ్గుతుంది. ఇది నెమ్మదిగా జీర్ణం అవుతుంది కాబట్టి తక్కువ సమయంలోనే కడుపు నిండిన భావన కలుగుతుంది. దాంతో ఎక్కువగా తినే అలవాటు తగ్గి శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. ఇది బరువు నియంత్రణకు చాలా ఉపయోగపడుతుంది.
క్యారెట్ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన టాక్సిన్ లను తొలగించడంలో సహాయపడతాయి. ఇది శరీరంలోని మెటబాలిజంను వేగవంతం చేస్తుంది. మెటబాలిజం చక్కగా పని చేస్తే కొవ్వు పదార్థాలు త్వరగా కరిగిపోయి శక్తిగా మారతాయి. దీని వల్ల అలసట తగ్గి శక్తివంతంగా ఉంటారు.
ఉదయం నిద్రలేవగానే పరగడుపున క్యారెట్ జ్యూస్ తాగడం చాలా మంచిది. ఈ సమయంలో శరీరం పోషకాలను సులభంగా గ్రహిస్తుంది. క్యారెట్ లోని పోషకాలు పూర్తిగా శరీరంలో కలిసిపోతాయి. ఇది రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచడమే కాకుండా.. బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
క్రమం తప్పకుండా రోజూ క్యారెట్ జ్యూస్ తీసుకుంటే.. కొన్ని వారాల్లోనే ఫలితాలు కనిపిస్తాయి. శరీరం తేలికగా అనిపించడమే కాకుండా.. చర్మం కూడా మెరుస్తుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. క్యారెట్ జ్యూస్ తో శరీరం లోపల, బయట మార్పు వస్తుంది.
తాజా క్యారెట్లను తీసుకుని బాగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని జ్యూసర్ లేదా మిక్సీలో వేసి కొద్దిగా నీరు కలిపి బాగా
గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా తేనె కలిపితే రుచి పెరుగుతుంది. దీన్ని వడకట్టకుండా నేరుగా తాగితే ఫైబర్ కూడా అందుతుంది. ఈ విధంగా క్యారెట్ జ్యూస్ రోజూ తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా బరువు తగ్గడమే కాదు.. శక్తివంతంగా ఉండగలుగుతారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)