Monkeypox: మంకీపాక్స్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందా..? నిపుణులు ఏమంటున్నారు..?

|

Jul 24, 2022 | 4:52 PM

Monkeypox: గత మూడేళ్లుగా కరోనా మహహ్మారి ప్రపంచాన్ని వణికించింది. లాక్‌డౌన్‌, వ్యాక్సినేషన్‌ ఇతర ఆంక్షల కారణంగా ప్రస్తుతం వైరస్‌ అదుపులో ఉంది. దీంతో కరోనా నుంచి..

Monkeypox: మంకీపాక్స్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందా..? నిపుణులు ఏమంటున్నారు..?
Monkeypox
Follow us on

Monkeypox: గత మూడేళ్లుగా కరోనా మహహ్మారి ప్రపంచాన్ని వణికించింది. లాక్‌డౌన్‌, వ్యాక్సినేషన్‌ ఇతర ఆంక్షల కారణంగా ప్రస్తుతం వైరస్‌ అదుపులో ఉంది. దీంతో కరోనా నుంచి కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి జనాలను ఆందోళనకు గురి చేసింది. ఇక తాజాగా కరోనా వైరల్‌ భయాందోళనకు గురి చేస్తోంది. అదే మంకీపాక్స్‌. కోతుల నుంచి ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిని గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఈ వ్యాధి ప్రపంచంలోని దాదాపు 70 దేశాలలో వ్యాపించిందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఇప్పటి వరకు దాదాపు 16 వేల కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా కరోనా లాంగి మంకీపాక్స్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందా..?అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

దీనిపై వైద్య నిపుణులు మాట్లాడుతూ.. మంకీపాక్స్ ఒక వైరల్ వ్యాధి. ఇది ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. అయితే కోతుల నుంచి వచ్చిన వ్యాధి.. ఒకరి నుంచి మరొకరికి ఏ దశలో వ్యాపిస్తుందనేది ప్రస్తుతానికి చెప్పలేమని నిపుణులు పేర్కొంటున్నారు.

మంకీపాక్స్ అనేది చాలా అరుదైన వ్యాధి అని, ఇది జంతువుల నుండి మనుషులకు వ్యాపించే వైరస్ వల్ల వస్తుందని డాక్టర్ గుంజన్ మిట్టల్ చెప్పారు. ఈ వైరస్ ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. అయితే మంకీపాక్స్ ఏ దశలో వ్యాపిస్తుందనే దానిపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి అని అన్నారు. పరిశోధనల తర్వాత ఈ వ్యాధిపై మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్నిహెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి