Breast cancer: ఈ సంకేతాలు మీలో కనిపిస్తే రొమ్ము క్యాన్సర్‌కు దారి తీయవచ్చు.. తస్మాత్ జాగ్రత్త..

|

Nov 30, 2022 | 6:50 AM

మహిళలు ఇంటి పనిలో బిజీగా ఉంటారు. కేవలం ఇంటి, వంట పనేకాదు. పిల్లల బాధ్యతలను చూసుకోవడం, కొంతమంది అయితే కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ బిజీగా ఉంటారు. సాధారణంగా వారికి విశ్రాంతి తీసుకునే సమయం తక్కువుగా..

Breast cancer: ఈ సంకేతాలు మీలో కనిపిస్తే రొమ్ము క్యాన్సర్‌కు దారి తీయవచ్చు.. తస్మాత్ జాగ్రత్త..
Breast cancer (Representative image)
Follow us on

మహిళలు ఇంటి పనిలో బిజీగా ఉంటారు. కేవలం ఇంటి, వంట పనేకాదు. పిల్లల బాధ్యతలను చూసుకోవడం, కొంతమంది అయితే కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ బిజీగా ఉంటారు. సాధారణంగా వారికి విశ్రాంతి తీసుకునే సమయం తక్కువుగా ఉంటుంది.  అందుకే రకరకాల వ్యాధులతో బాధపడుతుంటారు. వీటిలో ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్. దీనిని ప్రారంభ దశలోనే గుర్తించినట్లయితే చికిత్స చాలా సులభం. అయితే ఆలస్యంగా గుర్తిస్తే ఇది చాలా తీవ్రమవుతుంది. ఇప్పుడు భారతీయ మహిళల్లో ఇది చాలా సాధారణ క్యాన్సర్‌ అయిపోయింది. మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో ఇది దాదాపు 27 శాతంగా ఉంది. ఇటీవలి వాస్తవాల గురించి మాట్లాడితే భారతదేశంలోని పట్టణ ప్రాంతంలోని ప్రతి 28 మంది మహిళల్లో ఒకరు, గ్రామీణ భారతదేశంలో ప్రతి 60 మంది మహిళల్లో ఒకరు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నట్లు తేలింది.

రొమ్ము క్యాన్సర్‌ డీఎన్‌ఏ లేదా జన్యు పరివర్తన నష్టం కారణంగా అభివృద్ధి చెందుతుంది. రొమ్ము క్యాన్సర్‌తో మరణించే అవకాశం ఒక శాతం మాత్రమే అయినప్పటికీ ఇది చాలా ఇబ్బందులని కలిగిస్తుంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి రొమ్ము క్యాన్సర్ ప్రారంభ లక్షణాల గురించి తెలుసుకోవాలి. రొమ్ములో ఆకస్మిక మార్పులు సంభవించడాన్ని అస్సలు విస్మరించకూడదు. అది రొమ్ము క్యాన్సర్ ప్రారంభ లక్షణం కావొచ్చు. అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలాగే.. రొమ్ము, చంకలో నొప్పిలేని గడ్డలు ఏర్పడుతాయి. రొమ్ము చర్మంపై మార్పులు వస్తాయి. ఇవన్ని రొమ్ము క్యాన్సర్‌ లక్షణాలుగా చెప్పవచ్చు.

భారతదేశంలో రొమ్ము క్యాన్సర్‌కు శస్త్రచికిత్స ఉంది. అయినప్పటికీ రోగి పరిస్థితిని బట్టి శస్త్రచికిత్స, కీమోథెరపీ, హార్మోన్ థెరపీ, రేడియేషన్ థెరపీ లేదా టార్గెటెడ్ థెరపీ చేస్తారు. రొమ్ము క్యాన్సర్ దుష్ప్రభావాలు వారం నుంచి రెండు వారాలలోపు తగ్గుతాయి. అయితే కొన్ని మాత్రం తొలగిపోవడానికి చాలా నెలలు, సంవత్సరాలు పట్టే అవకాశాలు ఉన్నాయి. రొమ్ము క్యాన్సర్ కొన్ని సందర్భాలలో మహిళల్లో సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్లు కీమోథెరపీ అండాశయాలను దెబ్బతీస్తుంది. ఇది వంధ్యత్వానికి దారితీస్తుంది. అయినప్పటికీ సంతానోత్పత్తి సమస్యలు ఉన్నప్పటికీ మహిళలు ఐవిఎఫ్ లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రక్రియ వంటి ఎఆర్టీ విధానాల సహాయంతో గర్భం దాల్చవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..