Bone Health Tips: ఈ మూడు ఆహార పదార్థాలు మీ ఎముకలను మరింత దృఢంగా మార్చేస్తాయి..!

|

Jun 23, 2022 | 5:10 PM

Bone Health Tips: ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రజలు కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పులతో బాధపడుతున్నారు. కూర్చున్నా? నిల్చున్నా?

Bone Health Tips: ఈ మూడు ఆహార పదార్థాలు మీ ఎముకలను మరింత దృఢంగా మార్చేస్తాయి..!
Bone Health
Follow us on

Bone Health Tips: ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రజలు కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పులతో బాధపడుతున్నారు. కూర్చున్నా? నిల్చున్నా? తీవ్ర అవస్థలు పడుతున్నారు. కీళ్ల నొప్పుల కారణంగా నేలపై కూర్చుని లేవాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనంతటికీ కారణం.. ఆహారంలో పోషకాల లోపమే. ముఖ్యంగా వయసు పెరిగే కొద్ది ఈ సమస్యలు ఎక్కువగా వస్తాయి. అయితే, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడంతో పాటు.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సరైన ఆహార పదార్థాలు అవసరం అంటున్నారు పోషకాహార నిపుణులు. ముఖ్యంగా 3 రకాల ఆహార పదార్థాలను సూచించారు పోషకాహార నిపుణులు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నువ్వులు:
నువ్వులు మార్కెట్‌లో ఈజీగా లభిస్తాయి. వీటిలో ఫాస్పరస్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు ఎముకలను మరింత దృఢంగా మార్చుతాయి.

బీన్స్:
బీన్స్ కూడా ఎముకల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఎముకల ఆరోగ్యానికి అనుకూలమైన పోషకాల పవర్ హౌస్ ఈ బీన్స్ అంటారు పోషకాహార నిపుణులు. వీటిలో కాల్షియం, ఫాస్పరస్ అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మారుస్తాయి. కిడ్నీ బీన్స్, ఎడామామ్ వంటి వాటిని తీసుకోవడం ద్వారా ఎముకల నొప్పుల సమస్య ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

రాగులు:
రాగులు కూడా ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇందులో ఉండే పోషకాలు.. ఎముకలను స్ట్రాంగ్‌గా మారుస్తాయి. రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలకు అద్భుత శక్తిని ఇస్తుంది రాగి చిల్లా, పాన్‌ కేక్‌లు, రోటీలు, మరిన్ని రకాలుగా తయారు చేసి పిల్లలకు తినిపిస్తే ప్రయోజనం ఉంటుంది.

వీటితో పాటు మరికొన్ని పదార్థాలు కూడా ఎముకలను దృఢంగా మారుస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవి.. పైనాపిల్, బచ్చలికూర, వాల్ నట్స్, అరటిపండ్లు, బొప్పాయి. వీటిలో ఉండే పోషకాలు ఎముకలకు శక్తిని ఇచ్చి.. అనేక సమస్యలను దూరం చేస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..