Child Bone Health: మీ చిన్నారుల ఎముకలు ఐరన్‌లా స్ట్రాంగ్‌గా మారాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి.

| Edited By: Anil kumar poka

Jan 05, 2023 | 4:42 PM

ఎముకలు కౌమార దశలోనే వృద్ధి చెందుతాయి. ఈ దశలోనే ఎముకల సాంద్రత వేగంగా అభివృద్ధి చెందుతుంది. 18-25 సంవత్సరాలు వచ్చేసరికి పీక్ బోన్ మాస్ ను సాధిస్తాడు. అలాగే ఆ వయస్సు చేరే సరికి ఎముక సాంద్రత అభివృద్ధి చెందడం ఆగిపోతుంది.

Child Bone Health: మీ చిన్నారుల ఎముకలు ఐరన్‌లా స్ట్రాంగ్‌గా మారాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి.
Self Confidence In Kids
Follow us on

మీ పిల్లల ఎముకలు బలహీనంగా ఉన్నాయోమో? అని భయపడుతున్నారా? ఎముకల బలం కోసం ఎలాంటి ఆహారం పెట్టాలని ఆలోచిస్తున్నారా? వైద్య నిపుణుల ప్రకారం పిల్లల ఎముకలు కౌమార దశలోనే వృద్ధి చెందుతాయి. ఈ దశలోనే ఎముకల సాంద్రత వేగంగా అభివృద్ధి చెందుతుంది. 18-25 సంవత్సరాలు వచ్చేసరికి పీక్ బోన్ మాస్ ను సాధిస్తాడు. అలాగే ఆ వయస్సు చేరే సరికి ఎముక సాంద్రత అభివృద్ధి చెందడం ఆగిపోతుంది. కాబట్టే ఈ వయస్సులోనే పిల్లల ఎముకల ఆరోగ్యంపై దృష్టి పెట్టి ప్రత్యేకమైన ఆహారాన్ని ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. చిన్నవయస్సు నుంచి ఆరోగ్యకరమైన జీవన శైలి అవలంభిచమని పిల్లలను ప్రోత్సహించాలని చెబుతున్నారు. పిల్లల ఎముకల ఆరోగ్యం కోసం నిపుణుల సూచనలు ఇప్పుడు చూద్దాం.

విటమిన్-డి పెంపు

విటమని-డి ఎముకల ఆరోగ్యం పెంచడంతో చాలా సాయం చేస్తుంది. అలాగే శరీరం కాల్షియం గ్రహించడంలో సాయం చేస్తుంది. విటమిన్ -డి శరీరాన్ని ఎముకల వ్యాధులకు గురి కాకుండా చేస్తుంది. విటమిన్ డి పెంచుకునేందుకు ఉదయం సమయంలో సూర్యరశ్మి శరీరానికి తాకేలా వ్యాయామం చేయాలని నిపుణుల సూచన. సూర్మరశ్మి నుంచి శరీరంలో విటమిన్-డి సంగ్రహిస్తుంది. వారానికి రెండు నుంచి మూడు రోజులు కనీసం ఐదు నుంచి పది నిమిషాల పాటు సూర్యరశ్మి పొందేలా చూసుకోవాలి. అలాగే చీజ్, చేపలు వంటి ఆహారాన్ని తింటే విటమిన్-డి శరీరానికి అందుతుంది. 

కాల్షియం అందేలా చర్యలు

ఎముకల నిర్మాణంలో కాల్షియం ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే కాల్షియం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరగవుతుంది. పాలు, పెరుగు, జున్ను వంటి ఆహారాలు తీసుకుంటే కాల్షియం వృద్ధి చెందుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల ఎముకల ఆరోగ్యం కోసం ప్రతి రోజు కనీసం రెండు గ్లాసుల పాలు తాగే విధంగా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే డైలీ పెరుగన్నం తినేలా కూడా చూడాలి. అలాగే వారానికి మూడు రోజులైనా ఆహారంలో ఆకు కూరలు కూడా ఉండాలి. సోయా బీన్స్ ను అధికంగా పెడితే కూడా కాల్షియం వృద్ధి చెందుతుందని ప్రోటీన్ ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

విటమిన్-కె, మెగ్నీషియం

శరీరంలో విటమిన్-కె, మెగ్నీషియం అధికంగా ఉన్న వ్యక్తులు ఎక్కువ ఎముకల సాంద్రతతో ఉంటారని నిపుణుల వాదన. కాబట్టి పిల్లలకు ప్రతి రోజు బచ్చలి కూర, క్యాబేజి, ఆకుపచ్చ కూరగాయలతో ఆహారం పెడితే విటమిన్-కె, మెగ్నీషియం వృద్ధి చెందుతాయి. అలాగే అల్పాహారంలో తృణధాన్యాలు, మొలకలు వంటి ఆహరాన్ని చేరిస్తే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి.

శారీరక వ్యాయాయం

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగంలో ఎక్కువ మంది పిల్లలు ఫోన్ తోనే సమయం గడపుతున్నారు. ఈ కారణం వల్ల వారికి శారీరక వ్యాయామం ఉండడంలేదు. అలాగే బయట ఆటలు ఆడకపోవడంతో ఎముకల బలం ఉండట్లేదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పిల్లలను వీలైనంతగా అవుట్ డోర్ గేమ్స్ ఆడేలా ప్రోత్సహిస్తే ఎముకల సాంద్రత పెరుగుతుందని సూచిస్తున్నారు. 

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..