Health Tips: బస్సు ఎక్కేముందు ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే వాంతులు అస్సలు అవ్వవు.. చికాకు కూడా ఉండదు

|

Mar 03, 2023 | 8:40 PM

చాలామంది బస్సు లేదా కార్ జర్నీ చేసేందుకు ఇబ్బంది పడతారు. కడపులో తిప్పినట్లు ఉంటుంది. కొందరికి వాంతులు కూడా అవుతాయి. అలాంటి వారికే ఈ సజీషన్.

Health Tips: బస్సు ఎక్కేముందు ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే వాంతులు అస్సలు అవ్వవు.. చికాకు కూడా ఉండదు
Cinnarizine
Follow us on

మోషన్ సిక్‌నెస్.. ఇది చాలామంది ఫేస్ చేసేదే. కానీ పేరు మాత్రం తెలీదు. కొంతమంది బస్సు జర్నీ, కారు జర్నీ చేస్తూ.. వాంతులు చేసుకుంటూ ఉంటారు. కొందరికి వాంతులు అవ్వకపోయినా కడుపులో తిప్పినట్లు, చికాకుగా, ప్రస్తేషన్‌గా, తలంతా పట్టినట్లు ఉంటుంది. దీన్నే మోషన్ సిక్‌నెస్ అంటారు. ఈ ఇబ్బంది భయానకం. జర్నీలో మన వల్ల తోటి వాళ్లు కూడా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

ఇలాంటి ఇబ్బంది ఉన్నవాళ్లు జర్నీ ఉన్నప్పుడు ముందుగా ఒక మెడిసిన్ క్యారీ చేయాల్సి ఉంటుందని ప్రముఖ ప్రముఖ గ్యాస్ట్రో అండ్ బరియాట్రిక్ సర్జన్ డాక్టర్ రవికాంత్ కొంగర తెలిపారు. ఆ ట్యాబ్లెట్ పేరు.. Cinnarizine(Stugeron). ఇది ప్రయాణం ముందుగా వేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. Perinorm అనే వాంతి ట్యాబెట్‌ను కూడా బస్సు జర్నీ చేసేటప్పుడు, గుంతల రోడ్లలోప్రయాణించేటప్పుడు తీసుకోవచ్చని ఆయన చెప్పారు. ఈ రెండింటిలో ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం ద్వారా మోషన్ సిక్‌నెస్ అధిగమించవచ్చని తెలిపారు.

జర్నీ చేసేవాళ్లలో కూడా కళ్లు మూసుకున్నా, లేదా విండోలో నుంచి బయటకు చూస్తున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదని.. కేవలం.. ఒక ఫిక్స్‌డ్ ఆబ్జెక్ట్ చూడటం(ఉదాహారణకు ఫోన్ చూడటం, పేవర్ చదవడం) వల్ల ఇలాంటి సెన్సేషన్ ఉంటుందని డాక్టర్ వివరించారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)