AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chukkakura: చుక్కకూరకి క్యాన్సర్‌కి సంబంధం ఏంటి.. మీరు తింటున్నారా..? అయితే ఇది తెలుసుకోండి

చుక్కకూరలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. గుండెకు కూడా ఈ ఆకుకూర ఎంతో మేలు చేస్తుంది. మరిన్ని విషయాలు తెలుసుకుందాం పదండి.

Chukkakura: చుక్కకూరకి క్యాన్సర్‌కి సంబంధం ఏంటి.. మీరు తింటున్నారా..? అయితే ఇది తెలుసుకోండి
Chukkakura
Ram Naramaneni
|

Updated on: Mar 17, 2023 | 9:46 AM

Share

ఆకుకూరలు చాలా పోషకాలు నిండి ఉంటాయని డాక్టర్లు అందరూ చెబుతూ ఉంటారు. ఐరన్, కాల్సియం, విటమిన్ ఏ, సూక్ష్మ పోషకాలు, యాంటి ఆక్సిడెంట్స్, మినలర్స్ వంటివి.. కూరగాయల్లో కంటే ఆకుకూరల్లోనే ఎక్కువ ఉంటాయి. కూరగాయలు కంటే ఆకుకూరలే ఎక్కువ శక్తిని ఇస్తాయి. అంతేకాదు కూరగాయల్లో నూనె, ఉప్పు, మసాలాలు ఎక్కువ పడతాయి. కానీ ఆకుకూరల్లో అంతగా అవసరం పడవు. ఇవి పక్కనబెడితే కూరగాయల కంటే ఆకుకూరలు చాలా చవక కూడా. ముఖ్యంగా చుక్కకూరలో ఉండే పోషకాలు, దాని తినడం ద్వారా ప్రయోజనాలు ఈ రోజు తెలుసుకుందాం.

100 గ్రాముల చుక్కకూరలో.. నీటి శాతం 90 గ్రాములు, ఎనర్జీ 19 కిలో క్యాలరీలు, పిండి పదార్థాలు 2.3గ్రాములు, మాంసకృత్తులు 1.6 గ్రాములు, కొవ్వులు 1.2 గ్రాములు, పీచు పదార్థాలు 1.2గ్రాములు ఉంటాయి. ఇవన్నీ స్థూల పోషకాలు. ఇక సూక్ష్మ పోషకాల విషయానికి వస్తే.. విటమిన్ సి 53 మిల్లి గ్రాములు, విటమిన్ కె 126 మైక్రో గ్రాములు, లూటిన్ 2370 మైక్రో గ్రాములు, బీటాకెరెటిన్  2754 మైక్రో గ్రాములు, ఐరన్ 4 మిల్లి గ్రాములు, మెగ్నిషియం 48 మిల్లి గ్రాములు ఉంటాయి.

చుక్కకూర ప్రయోజనాలు:

  1. గుండెకు రక్త సరఫరా చేసే నాళాల్లో పూడికలు లేకుండా చూస్తుంది చుక్కకూర
  2. రక్తానాళాల లోపల ఉండే పొరల్లో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెరిగిలా చేస్తుంది. దీంతో రక్తనాళాలు వ్యాకోచం చెందుతాయి. అప్పుడు బీపీ కంట్రోల్ అవుతుంది.
  3. ఆడవారికి వచ్చే రొమ్ము క్యాన్సర్, సర్విక్ క్యాన్సర్ రాకుండా చుక్కకూర నివారిస్తుంది. అయితే చుక్కకూరను వండే తినాలి. పచ్చిగా దేనిలో మిక్స్ చేయకూడదు.
  4. బాలింతలకు పాలు బాగా పెరగాలంటే.. చుక్కకూర తినాల్సిందే.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం క్లిక్‌ చేయండి.  

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం