
పసుపులో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపేలా సహాయపడతాయి. ఇది జీవక్రియను వేగవంతం చేసి అధిక కొవ్వు నిల్వల నుండి ఉపశమనం కలిగించవచ్చు. అలాగే శరీరంలోని చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడంలో కూడా ఇది మేలు చేస్తుంది.
వెల్లుల్లి వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంది. ఇది శరీరంలోని కొవ్వు కణాలను కరిగించే చర్యలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. రోజూ ఉదయం ఖాళీ కడుపున వెల్లుల్లి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.
దాల్చిన చెక్క ఆహారంపై నియంత్రణ పెంచే గుణం కలిగి ఉంటుంది. ఇది ఆకలిని తగ్గించి ఎక్కువ ఆహారం తినే అలవాటును నివారించవచ్చు. అంతేకాదు ఇది రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యంలో ఉంచుతుందని పరిశోధనల్లో నిరూపితమైంది.
అల్లం జీర్ణక్రియను వేగవంతం చేయడంలో తోడ్పడుతుంది. ఇది శరీరంలోని వేడిని పెంచి జీవక్రియను వేగంగా నడిచేలా చేస్తుంది. ఆకలి తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
మెంతులు ఫైబర్ తో నిండి ఉంటాయి. ఇవి ఆకలిని అదుపు చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. సరిపడా మోతాదులో మెంతులు నానబెట్టి తీసుకుంటే.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది, బరువు నియంత్రణలో ఉంటుంది.
ఎండుమిరప (Cayenne Pepper) ఈ మసాలా పదార్థంలో ఉండే క్యాప్సైసిన్ అనే రసాయనం శరీరంలో వేడిని పెంచుతుంది. ఇది క్యాలరీల దహనాన్ని వేగవంతం చేస్తుంది. దీన్ని రోజువారీ వంటల్లో చేర్చడం వల్ల కొవ్వు కరిగించడంలో సహాయపడుతుంది.
మిరియాల్లో ఉండే పైపెరిన్ అనే పదార్థం కొవ్వును తొలగించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా చూసుకుంటుంది. దీనిని వంటల్లో తక్కువ మోతాదులో ఉపయోగించడం మంచిది.
జీలకర్ర జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. ఇది గ్యాస్, ఉబ్బసం లాంటి సమస్యలు రాకుండా సహాయపడుతుంది. భోజనం తర్వాత చిన్న మోతాదులో జీలకర్ర తీసుకోవడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది.
ఈ సహజ పదార్థాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా బరువు తగ్గే ప్రక్రియను సహజంగానే మొదలుపెట్టవచ్చు. వీటితో పాటు తగినంత నీరు తాగడం, సరిగా నిద్రపోవడం, తక్కువ తీపి వంటలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. కాస్తంత నిబద్ధతతో ఈ చిట్కాలను పాటిస్తే ఖర్చు లేకుండా ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)