పొడి చర్మం సమస్య వేధిస్తోందా..? అయితే ఇది మీకోసమే..!

చర్మాన్ని తేమగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. పొడి చర్మం కారణంగా రఫ్‌నెస్, కాంతి కోల్పోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. సహజమైన పద్ధతులు పాటించడం ద్వారా చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవచ్చు. కీరదోస, కలబంద, తేనె, కొబ్బరి నీళ్లు, యోగర్ట్ లాంటి సహజ పదార్థాలు చర్మానికి తేమను అందించి మృదువుగా, అందంగా మార్చుతాయి.

పొడి చర్మం సమస్య వేధిస్తోందా..? అయితే ఇది మీకోసమే..!
Glowing Skin

Updated on: Mar 30, 2025 | 10:13 PM

చర్మం తేమ కోల్పోతే అది పొడిగా మారి చాలా సమస్యలకు దారి తీస్తుంది. డీహైడ్రేషన్ వల్ల చర్మం రఫ్‌గా మారడంతో పాటు వేడి ప్రభావంతో దాని సహజ తేజస్సు తగ్గిపోతుంది. పొడి చర్మం ఉన్నవారికి ఎప్పుడూ మాయిశ్చరైజింగ్ అవసరం. చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం వల్ల మృదువుగా, కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. సహజసిద్ధమైన చిట్కాలు పాటించడం ద్వారా చర్మాన్ని మృదువుగా మార్చుకోవచ్చు.

కీరదోసలో ఎక్కువ మోతాదులో నీరు ఉండటంతో ఇది చర్మానికి సహజమైన తేమను అందిస్తుంది. ఇది శరీరాన్ని చల్లబరిచే గుణాలను కలిగి ఉంది. కీరదోస ముక్కలను నేరుగా ముఖానికి రాసుకోవచ్చు లేదా దాని గుజ్జును మృదువైన మాస్క్‌లా అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత కడిగేస్తే చర్మం కాంతివంతంగా హైడ్రేట్‌గా మారుతుంది.

కలబందలో సహజమైన మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. దీని గుజ్జును నేరుగా ముఖానికి రాస్తే పొడి చర్మం మృదువుగా మారుతుంది. రోజూ దీనిని అప్లై చేస్తే చర్మం నాజూకుగా మారటంతో పాటు ఎండ వల్ల వచ్చే దుష్ప్రభావాల నుంచి రక్షణ లభిస్తుంది.

కొబ్బరి నీళ్లు శరీరానికి తగినంత తేమను అందించడంలో సహాయపడతాయి. ఇవి సహజ ఎలక్ట్రోలైట్స్‌ను కలిగి ఉండటం వల్ల డీహైడ్రేషన్ సమస్య రాదు. రోజూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

తేనె సహజమైన మాయిశ్చరైజర్. ఇది చర్మానికి అవసరమైన తేమను అందించి, పొడిబారిన చర్మాన్ని మృదువుగా మార్చుతుంది. క్రమంగా చర్మం మెరుస్తూ ఆరోగ్యంగా కనిపిస్తుంది.

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే సన్ డామేజ్‌ను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది.

పెరుగు సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. యోగర్ట్‌ను ముఖానికి రాస్తే చర్మం తేమగా మారుతుంది. చర్మాన్ని మృదువుగా, స్మూత్‌గా ఉంచేందుకు ఇది సహాయపడుతుంది.

ఆలివ్ ఆయిల్ చర్మానికి సహజమైన తేమను అందిస్తుంది. దీనిని ముఖానికి రాసి కొద్ది నిమిషాల పాటు ఉంచి కడిగేస్తే చర్మం తేమతో మెరుస్తుంది. రాత్రిపూట దీన్ని అప్లై చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. దీని కోసం ఎక్కువ నీరు తాగడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అవసరం. సహజమైన చిట్కాలు పాటించడం వల్ల పొడిబారిన చర్మాన్ని తేమతో ఉంచుకోవచ్చు. కీరదోస, కలబంద, తేనె, యోగర్ట్, ఆలివ్ ఆయిల్, గ్రీన్ టీ లాంటి సహజ పదార్థాలను ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది.