
థైరాయిడ్ సమస్య ఉన్నవారు తీసుకునే ఆహారం చాలా కీలకం. సరైన ఆహారం తీసుకుంటే ఈ సమస్య తక్కువ అవుతుంది. కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం ద్వారా థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యంగా పని చేస్తుంది. అలాంటి ఆహారాల ఏవో వాటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
చికెన్, గుమ్మడి విత్తనాలు, బీన్స్‌లో జింక్ ఉంటుంది. జింక్ తినడం వల్ల థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి బాగా జరుగుతుంది. గ్రంథి ఆరోగ్యం మెరుగవుతుంది.
చేపలు, డెయిరీ ఉత్పత్తుల్లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేస్తుంది. విటమిన్ డి తినడం వల్ల హార్మోన్లు సమంగా ఉత్పత్తి అవుతాయి.
గ్రీన్ టీ తాగడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వాపు తగ్గిస్తాయి. రోజూ గ్రీన్ టీ తాగితే థైరాయిడ్ ప్రభావం తక్కువగా ఉంటుంది.
బ్రోకలీ, క్యాలీఫ్లవర్, కాలే అనే కూరగాయలు గ్రంథి పనితీరుపై మంచి ప్రభావం చూపుతాయి. ఇవి తినడం వల్ల హార్మోన్ల ఉత్పత్తి క్రమబద్ధంగా ఉంటుంది. వీటిని మితంగా తింటే మంచి ఫలితం వస్తుంది.
రక్తంలో ఐరన్ స్థాయి తక్కువగా ఉన్నప్పుడు హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. అందుకే రెడ్ మీట్, పాలకూర, బీన్స్, ఫోర్టిఫైడ్ సెరల్స్ తినాలి. వీటి ద్వారా ఐరన్ అందుతుంది. థైరాయిడ్ సమస్య తగ్గుతుంది.
థైరాయిడ్ సమస్య ఉన్నవారు అయోడిన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినాలి. ఉదాహరణకు అయోడైజ్డ్ ఉప్పు, సీవీడ్, కాడ్ లివర్, డెయిరీ ప్రొడక్ట్స్ తింటే థైరాయిడ్ పనితీరు మెరుగవుతుంది. ఈ పదార్థాలు తినడం వల్ల గ్రంథి బాగా పనిచేస్తుంది.
బ్రెజిల్ నట్స్, ట్యూనా, సార్డినెస్, టర్కీ గుడ్లు తినడం ద్వారా సెలీనియం అందుతుంది. ఇది గ్రంథికి అవసరమైన ఖనిజం. ఈ ఆహారం తీసుకుంటే హార్మోన్ల సమతుల్యత కాపాడుతుంది. థైరాయిడ్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
సాల్మన్, ట్యూనా, మాకెరెల్ అనే చేపలలో ఒమేగా-3 ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరంలో వాపు తగ్గించడంలో సహాయపడతాయి. వాల్‌నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ తినడం ద్వారా కూడా ఒమేగా-3 అందుతుంది. ఇవి తీసుకుంటే థైరాయిడ్ బాధ తగ్గుతుంది.
బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్ తినడం వల్ల శరీరంలో కణాలు ఆరోగ్యంగా మారుతాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. గ్రంథిలో కణాలు మెరుగుపడతాయి.
థైరాయిడ్ సమస్య ఉన్నవారు బలమైన ఆహారం తీసుకోవాలి. పౌష్టిక పదార్థాలు ప్రతి రోజూ తినాలి. కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. ఆరోగ్యంగా జీవించాలంటే సరైన ఆహారం అనేది చాలా అవసరం.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)