Healthy Cooking Oils: ఈ కుకింగ్ ఆయిల్స్ వాడితే బరువు తగ్గుతారు.. షుగర్ కూడా కంట్రోల్ లో ఉంటుంది..!

ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే శరీరానికి సరైన పోషణ అవసరం. ఇందులో ముఖ్యమైన భాగం ఆయిల్ ఎంపిక. చాలా మందికి నూనె అనగానే అది కొవ్వుగా భావించి పూర్తిగా మానేయాలనిపిస్తుంది. కానీ నిజానికి కొన్ని ఆరోగ్యకరమైన నూనెలు జీవక్రియను మెరుగుపరచడంలో, కొవ్వు కరిగించడంలో సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునే వారు వంటలో ఉపయోగించదగిన కొన్ని నూనెల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Healthy Cooking Oils: ఈ కుకింగ్ ఆయిల్స్ వాడితే బరువు తగ్గుతారు.. షుగర్ కూడా కంట్రోల్ లో ఉంటుంది..!
Weight Loss Food Diet

Updated on: Jun 01, 2025 | 4:11 PM

ఆలివ్ ఆయిల్‌ లో మోనో అన్సాచ్యురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీన్ని వంటల్లో ఉపయోగించడం వల్ల శరీర జీవక్రియ వేగంగా జరుగుతుంది. దీంతో శరీరం ఎక్కువ కేలరీలను ఖర్చు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో శరీరానికి రక్షణ కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారు రోజువారీ వంటల్లో తక్కువ పరిమాణంలో ఈ నూనెను వాడటం ఉత్తమం.

కుసుమ నూనెలో లీనోలిక్ యాసిడ్ అనే పదార్థం ఉంటుంది. ఇది బాడీ ఫ్యాట్ కరిగించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించడంతోపాటు బ్లడ్ షుగర్‌ ను బ్యాలెన్స్‌ లో ఉంచుతుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఉపయోగపడుతుంది.

కొబ్బరి నూనెలో మధ్యస్థ శ్రేణి ట్రైగ్లిసరైడ్‌లు (MCTs) పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో త్వరగా జీర్ణమై శక్తిగా మారిపోతాయి. దీని వల్ల మానవ శరీర జీవక్రియ వేగవంతం అవుతుంది. రోజూ వంటలో కొద్దిగా కొబ్బరి నూనె వాడటం వలన కొవ్వు నిల్వలు తక్కువవుతాయి.

అవకాడో నూనెలో మంచి కొవ్వులైన మోనో అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ నూనెను వంటల్లో వాడితే గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అంతేకాక ఇది జీవక్రియను పెంచుతుంది. శరీర బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ ఇ కూడా ఉండటంతో చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

నువ్వుల నూనెలో పాలీ అన్సాచ్యురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి ఇన్‌ సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ నూనెను వాడటం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా ఒత్తిడి తగ్గుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉండటం వలన కొలెస్ట్రాల్ స్థాయిలు సర్దుబాటు అవుతాయి.

బాదం, వాల్నట్, ఫ్లాక్స్ సీడ్, చియా సీడ్ వంటి గింజలు, విత్తనాల నుంచి తయారైన నూనెల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ ను తగ్గిస్తాయి. అలాగే జీవక్రియను పటిష్టంగా ఉంచుతాయి. వీటిని చిన్న మోతాదుల్లో వంటలో వాడటం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది. జీవక్రియను మెరుగుపరచే, ఇన్ఫ్లమేషన్ తగ్గించే, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఈ నూనెలను వంటల్లో చేర్చడం వల్ల మీరు ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)