Benefits of Walking: నడక వల్ల కలిగే ప్రయోజనాలను ఎన్నో ఉన్నాయి. ఇది ఏ వ్యక్తి అయినా చాలా సులభంగా చేయగలిగే వ్యాయామం. నేటి బిజీ లైఫ్ కారణంగా, నిపుణులు నడకకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇది మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇటీవలి పరిశోధన ప్రకారం, ఇది మరణ ప్రమాదాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తుంది. యూనివర్శిటీ ఆఫ్ మసాచుసెట్స్, అమెరికాలోని శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ఇది లాన్సెట్ పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించారు. 4 ఖండాలకు చెందిన 50 వేల మందిపై 15 అధ్యయనాలను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. రోజువారీ నడక మంచి ఆరోగ్యం(Health), దీర్ఘాయువుకు దారితీస్తుందని ఈ డేటా చూపించింది.
50 వేల మందిని 4 గ్రూపులుగా విభజించారు. మొదటి సమూహం సగటున 3,500 అడుగులు, రెండవది 5,800 అడుగులు, మూడవది 7,800 అడుగులు, నాల్గవది 10,900 అడుగులు వేయలాని టార్గెట్ పెట్టారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, అత్యంత చురుకుగా ఉన్న మూడు సమూహాలు మరణ ప్రమాదాన్ని 40 నుంచి 53శాతం వరకు తగ్గించినట్లు కనుగొన్నారు.
రోజూ 10 వేల అడుగులు నడవాల్సిన అవసరం లేదు..
ప్రతిరోజూ 10,000 అడుగులు నడవాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 60 ఏళ్ల లోపు వారు 8 నుంచి 10 వేలు, 60 ఏళ్లు పైబడిన వారు 6 నుంచి 8 వేల అడుగులు వేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని తెలిపారు.
నడక వేగంలో పట్టింపు లేదు..
యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ అమ్హెర్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ ఎపిడెమియాలజిస్ట్ అమండా పలుచ్ ప్రకారం, నడక వేగం దీర్ఘాయువుతో సంబంధం లేదని పరిశోధన ఫలితాలు సూచిస్తున్నాయి. వేగంగా లేదా నెమ్మదిగా వెళ్లడంలో ఎటువంటి మార్పులేదు. అంటే, మీరు రోజూ ఎంత ఎక్కువ నడిస్తే, మీ మరణ ప్రమాదం అంత తక్కువగా ఉంటుంది.
Also Read: Health Tips: ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!
Health Tips: ఈ ఐదు మార్గాలను అనుసరిస్తే ఇన్ఫెక్షన్లతో పోరాడవచ్చు..!