Pomegranate Peel Uses: కాలంతో సంబంధం లేకుండా నిత్యం అందుబాటులో ఉండే పండ్లలో దానిమ్మ ఒకటి. ఎర్రగా చూడగానే నోరురూరించే దానిమ్మ పండ్లు కేవలం రుచికి మాత్రమే పరిమితం కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. దానిమ్మ గింజల్లో ఉండే పోషక గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే గింజలను తినేసి తొక్కను మాత్రం చెత్తలో పడేస్తుంటాం. అయితే దానిమ్మ తొక్కలో ఉన్న ఔషధగుణాలు తెలిస్తే ఇకపై తొక్కను పడేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఇంతకీ దానిమ్మ తొక్కతో కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* దానిమ్మ తొక్కను ఎండబెట్టి పొడి చేసి దాన్ని కాస్త నీటిలో కలిపి పేస్ట్‌లా చేసుకొని దాంతో దంతాలను తొముకోవాలి. ఇలా చేస్తే పళ్లు తెల్లగా మారతాయి. అంతేకాకుండా నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది.
* దానిమ్మ తొక్కలను వేడి నీటిలో నానబెట్టి ఆ నీటిని కషాయంలా తాగాలి దీంతో కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. అంతేకాకుండా వీటిలో ఉండే ఔషధ గుణాల వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకి వెళ్లిపోతాయి.
* దానిమ్మ తొక్క కేవలం ఆరోగ్యానికికే పరిమితం కాకుండా సౌంధర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. దానిమ్మ తొక్కను ఎండబెట్టి అందులో రోజ్ వాటర్ కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల.. చర్మానికి నిగారింపు వచ్చి ప్రకాశవంతంగా మారుతుంది.
* దానిమ్మ తొక్కను ఎండబెట్టి, పొడిగా మార్చి.. ఆ పొడిని గోరు వెచ్చని కొబ్బరి నూనెలో కలుపుకొని మిశ్రమాన్ని తలకు పట్టించాలి. అనంతరం ఓ 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి.. ఇలా తరుచూ చేస్తుంటే చుండ్రు సమస్య తగ్గుతుంది. చూశారుగా దానిమ్మ తొక్కతో ఎన్ని లాభాలున్నాయో.. ఇకపై దానిమ్మ పండు తిన్న తర్వాత తొక్కను చెత్తలో వేయకుండా.. ఇలా సద్వినియోగపరుచుకోండి.
Also Read: Pulsar ns125 : పల్సర్ బైక్ ఇప్పుడు సరికొత్త వేరియెంట్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు.. ధర కూడా తక్కువే..?