ఈ వర్షాకాలంలో మార్కెట్ లో ఎక్కువగా లభించే పండ్లలో అల్ బుకరా పండ్లు ఒకటి. ఇవి మనందరికీ తెలుసు. వీటిని మనలో చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. చూడగానే తినాలనించేలా ఉండే ఈ పండ్లు తియ్యని, పుల్లని రుచిని కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అల్ బుకరా పండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పండ్లు పోషకాల గని అని చెప్పవచ్చు. ఈ పండ్లలో విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ డిలతోపాటు ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి మినరల్స్ ఉంటాయి.
వర్షాకాలంలో ఈ పండ్లు మనకు విరివిరిగా లభిస్తాయి. ఈ పండ్లను తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి వాతావరణ మార్పుల కారణంగా వచ్చే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాం. మన శరీరంలో ఉండే విషతుల్యాలను బయటకు పంపించడంలో ఈ పండ్లు మనకు సహాయపడతాయి. ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచడంలో అల్ బుకరా పండ్లు ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల శరీరంలో అధికంగా ఉండే వేడి తగ్గి శరీరానికి చలువ చేస్తుంది. గర్భిణీలు వీటిని తినడం వల్ల తగినంత ఫోలిక్ యాసిడ్ లభించి గర్భస్థ శిశువు ఎదుగుదల చక్కగా ఉంటుంది.
కానీ పుల్లగా, తీపిగా ఉంటాయి. ఇవి పెద్ద పెద్ద వ్యాధులతో పోరాడడంలో మనకు సహాయపడతాయి. అనేక రకాల గుండె జబ్బుల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచడంలో కూడా ఆలూ బుఖారా సహాయపడుతుంది. అటువంటి ఇతర ప్రయోజనాల గురించి మీకు తెలియజేస్తాము. ఆలూ బుఖారా తీసుకోవడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాల గురించి తెలుసుకోండి.
బరువు తగ్గించడంలో సహాయపడుతుంది
ఆలూ బుఖారా తినడం వల్ల కూడా బరువును అదుపులో తీసుకువస్తుంది. ఈ పండులో మంచి పీచు పదార్థం ఉంటాయి. ఈ పండులో సూపర్ ఆక్సైడ్ కూడా ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తి బూస్టర్..
ఆలూ బుఖారా కోవిడ్ కారణంగా చాలా మంది రోగనిరోధక శక్తి బలహీనపడుతున్నట్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ సందర్భంలో మీరు ఆలూ బుఖారా తినవచ్చు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
మలబద్ధకం సమస్యకు చెక్..
ఆలూ బుఖారా తీసుకోవడం ద్వారా మలబద్ధకం సమస్య కూడా తొలగిపోతుంది. దీని వినియోగం వల్ల కంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. అందుకే ఆలూ బుఖారాను తీసుకోవచ్చు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)