Beauty Tips: గుడ్లలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ప్రోటీన్ అధికంగా ఉంటుందని మనందరికీ తెలుసు. అయితే గుడ్డులోని తెల్లటి భాగం మాత్రమే కాకుండా, పచ్చసొన కూడా చర్మం, జుట్టుకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇదిలాఉంటే.. సాధారణంగా ప్రజలు గుడ్డు పెంకులను పారేస్తారు. కానీ, గుడ్డు పెంకు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? గుడ్డు పెంకు మీ చర్మానికి సహజసిద్ధ కాంతిని అందిస్తుందని మీకు తెలుసా?.. తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి..
చర్మ సంబంధిత సమస్యలను తొలగించడంలో గుడ్డు పెంకు సహాయపడుతుంది. ఇది మీ చర్మాన్ని సహజంగా పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. చర్మం నుండి మృత చర్మాన్ని తొలగించడంలో కూడా సహాయపడుతుంది. దీని కోసం, మీరు గుడ్డు పెంకులను మెత్తగా, పొడి చేయాలి. ఈ పొడిని వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు. దీన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
తేనె, నిమ్మరసం..
చర్మంపై మచ్చలను తొలగించడానికి ఒక గుడ్డు షెల్ పొడిలో రెండు చెంచాల తేనె, నిమ్మరసం కలపండి. బాగా కలిపి.. చిక్కటి పేస్ట్‌లా రెడీ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. అలా 15 నిమిషాల పాటు ఉంచి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్‌ను అప్లై చేయడం ద్వారా కొన్ని వారాలలో ముఖం మీద గ్లో కనిపించడం ప్రారంభమవుతుంది.
కలబందతో పేస్ట్..
ఎగ్ షెల్ పొడిలో కలబంద జెల్ మిక్స్ చేసి పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్‌ని మీ ముఖం మీద అప్లై చేయండి. దానిని 10 నుంచి15 నిమిషాల పాటు ఉంచి, తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మీ చర్మం తేమగా ఉంటుంది.
జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది..
గుడ్డు పెంకులను ఉపయోగించి మీరు హెయిర్ మాస్క్ కూడా తయారు చేసుకోవచ్చు. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే, గుడ్డు షెల్ పౌడర్, పెరుగు కలపి ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి. ఆ పేస్ట్‌ని మీ జుట్టుకు అప్లై చేసుకోవాలి. సుమారు 45 నిమిషాల పాటు అలా ఉంచి జుట్టును మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ వేసుకోవడం ద్వారా మీ జుట్టు బలంగా, మందంగా మారుతుంది. ఇది కాకుండా, మీ చర్మం జిడ్డుగా ఉంటే, గుడ్డు షెల్ పౌడర్‌లో తెల్ల సొనను కలపి పేస్ట్‌లా చేయండి. ఈ పేస్ట్‌ని 10 నిమిషాల పాటు అలాగే ఉంచి, తర్వాత మంచినీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
Also read:
Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే, వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..
Silver Price Today: బంగారం బాటలోనే వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే..?