చాలా మందికి చేతులు, కాళ్లు, ముఖం, గడ్డం, పై పెదవిపై అవాంఛిత రోమాలు ఉంటాయి. పీసీఓడీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్ ఉన్నవారికి అవాంఛిత రోమాల సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. వీటిని తగ్గించుకునేందుకు బ్యూటీపార్లర్ల చుట్టూ తిరిగి వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్, లేజర్ ట్రీట్మెంట్ల కోసం చాలా ఖర్చుచేసి ఉంటారు. ఇకపై మీకు అంత ఖర్చు అక్కర్లేదు. ఇంట్లోనే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా అవాంఛిత రోమాలను తగ్గించుకోవచ్చు.
శనగపిండి ప్యాక్:
ముఖంపై వచ్చిన అవాంఛిత రోమాలను తొలగించుకునేందుకు ఈ ప్యాక్ వాడాలి. ఇందుకోసం శనగపిండిని తీసుకుని, అందులో రోజ్ వాటర్ వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలున్న చోట రాస్తే.. అవి క్రమంగా రాలిపోతాయి.
ముల్తానీ – మసూర్ దాల్ ప్యాక్:
ముల్తానీమట్టి – మసూర్ దాల్ (ఎర్ర కందిపప్పు)తో చేసే ఈ ప్యాక్ తో అన్ వాంటెడ్ హెయిర్ ను తొలగించుకోవచ్చు. గిన్నెలో మల్తానీమట్టి, మసూర్ దాల్ పొడిని మూడు స్పూన్ల చొప్పున తీసుకోవాలి. ఇందులో మిల్క్ క్రీమ్ వేసి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ ను రోమాలున్న చోట రాయాలి. పేస్ట్ ఆరిపోయాక మెత్తని రుమాలుతో సున్నితంగా యాంటీ క్లాక్ వైజ్ లో రుద్దాలి. ఇలా 20-25 రోజులపాటు చేస్తే.. అవాంఛిత రోమాలు పోతాయి.
ఇన్ స్టంట్ గా అవాంఛిత రోమాలు పోవాలంటే.. వ్యాక్సింగ్ చేయించుకుంటారు కదా. తేనె- నిమ్మకాయతో ఆ వ్యాక్సింగ్ మీరే ఇంట్లో చేసుకోవచ్చు. రెండు చెంచాల తేనెలో.. ఒక చెంచా నిమ్మరసం వేసి 5 నిమిషాలపాటు బాగా కలుపుకోవాలి. తేనె కొద్దిగా రంగు మారుతుంది. అవాంఛిత రోమాలపై దీనిని అప్లై చేసి.. స్ట్రిప్ తో లాగితే.. వెంటనే అవి ఊడిపోతాయి.
పంచదారతో వ్యాక్సింగ్:
4-5 స్పూన్ల చక్కెరను వేడిచేస్తే అది పాకంగా మారుతుంది. కొద్దిగా చల్లారిన తర్వాత అందులో నిమ్మకాయరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కాళ్లు, చేతులు, నోటిపై.. ఇంకా ఎక్కడెక్కడ అవాంఛిత రోమాలున్నాయో రాయాలి. స్ట్రిప్స్ సహాయంతో వాటిని లాగితే.. జుట్టు ఊడిపోతుంది. వ్యాక్సింగ్ చేసుకున్నాక కాస్త మంట కలిగినట్లు అనిపిస్తే.. మాయిశ్చరైజర్ వాడండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి