Stress Relief: ప్రతిరోజూ 15 నిమిషాలు కేటాయిస్తే ఒత్తిడిని సులభంగా ఎదుర్కోవచ్చని తెలుసా?

ఈ రోజుల్లో ఒత్తిడి లేని సగటు మనిషి లేడంటే అతిశయోక్తి కాదు. సాంకేతికత, మారిన జీవనశైలి.. ఇలా ఒత్తిడికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఉద్యోగం, కుటుంబం, ఆరోగ్య సమస్యలు, సోషల్ మీడియా.. అన్నీ కలిసి ఒత్తిడిని పెంచేస్తూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. తలనొప్పి, ఆందోళన ..

Stress Relief: ప్రతిరోజూ 15 నిమిషాలు కేటాయిస్తే ఒత్తిడిని సులభంగా ఎదుర్కోవచ్చని తెలుసా?
Yoga

Updated on: Nov 24, 2025 | 9:30 AM

ఈ రోజుల్లో ఒత్తిడి లేని సగటు మనిషి లేడంటే అతిశయోక్తి కాదు. సాంకేతికత, మారిన జీవనశైలి.. ఇలా ఒత్తిడికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఉద్యోగం, కుటుంబం, ఆరోగ్య సమస్యలు, సోషల్ మీడియా.. అన్నీ కలిసి ఒత్తిడిని పెంచేస్తూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. తలనొప్పి, ఆందోళన, నిద్ర లేకపోవడం… ఇవన్నీ సాధారణమే అవుతున్నాయి.

కానీ వీటిని ఎదుర్కొనే మ్యాజిక్ మార్గం ఏంటంటే? యోగా! ముఖ్యంగా ప్రాణాయామం (శ్వాస వ్యాయామాలు). రోజుకి ఒక్క గంట కాలేదా, ఒత్తిడిగా ఉన్నప్పుడు 10-15 నిమిషాలు చేసినా మంచి ఫలితం ఉంటుంది. మనసు కూల్‌గా, శరీరం ఫ్రెష్‌గా ఉంటాయి. ఏ ఆసనాలు ఒత్తిడిని తగ్గిస్తాయో తెలుసుకుందాం..

పద్మాసనం

యోగా మొదలు పెట్టేందుకు మొదటి ఆసనం ఇది. మామూలుగా కూర్చునే స్థితి. మార్నింగ్ టైంలో ఫ్రెష్ ఎయిర్ ఉన్న ప్లేస్‌లో కూర్చోండి. కాళ్లు క్రాస్‌లెగ్డ్‌గా పెట్టుకోండి. నిటారుగా కూర్చుని చేతులు మోకాళ్ల మీద పెట్టుకోవాలి. కళ్లు మూసుకుని ప్రాణాయామం చేయాలి. ఇది మనసుకి ప్రశాంతత ఇస్తుంది. శ్వాస తప్ప మరేమీ ఆలోచించకుండా చేస్తుంది. స్ట్రెస్ వచ్చినప్పుడు ఈ పోజ్‌లో కూర్చొని డీప్ బ్రీత్ తీసుకుంటే మనసు తేలికపడుతుంది.

ప్రాణాయామం

దీనిని అనులోమ విలోమ అని కూడా పిలుస్తారు. పద్మాసనంలో కూర్చుని, కుడిచేతి బొటనవేలితో కుడివైపు ముక్కు మూసి దీర్ఘశ్వాస తీసుకుని ఎడమ వైపు ముక్కు మూసి కుడి వైపు ముక్కు ద్వారా వదలాలి. ఇలా 5 నుంచి 10 సార్లు చేయడం వల్ల శ్వాసక్రియ సజావుగా సాగి ఊపిరితిత్తులకు ఆక్సిజన్​ బాగా అందుతుంది. తద్వారా మెదడుకు ఆక్సీజన్​ సరఫరా పెరిగి మెదడు కణాల పనితీరు మెరుగుపడుతుంది.

ప్రాణాయామం వల్ల మొదట శరీరానికి ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. స్ట్రెస్ హార్మోన్స్‌ని కంట్రోల్ చేసి, తలనొప్పి, ఉద్రిక్తత, డిప్రెషన్‌ని దూరం చేస్తుంది. నిద్ర మంచిగా పడుతుంది. మెదడు బాగా పని చేస్తుంది. సమస్యలు వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా సాఫీగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. రోజుకి గంటపాటు యోగ చేస్తే ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుదిరితే పొద్దున, సాయంత్రం లేదంటే రోజూ పొద్దున చేసినా మంచి ఫలితం ఉంటుంది. మరెందుకు ఆలస్యం.. మీరూ ఈ రోజే ప్రారంభించి మీ ఒత్తిడికి టాటా చెప్పేయండి!

NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే జారీ చేయబడినవి.. వీటిని మేం ధృవీకరించలేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.