Banana
అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనడంలో సందేహం లేదు . ఇందులో పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ సి, మెగ్నీషియం, కాపర్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు వంటి అన్ని రకాల పోషకాలు ఉంటాయి. అరటిపండులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్‌ను తయారు చేస్తుంది. ముఖ్యంగా మహిళల్లో రక్తహీనతతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇక అరటిపండు తినడం వల్ల పలు రోగాలు దూరమవుతాయి. అందుకే వైద్యులతో పాటు పెద్దలు కూడా అరటి పండ్లు తినమని సలహాలు ఇస్తుంటారు. అయితే రాత్రిపూట అరటిపండు తినడం మంచిది కాదంటారు చాలామంది. దీని వెనక ఉన్న కారణమేంటో తెలుసుకుందాం రండి. ఆయుర్వేదం ప్రకారం, రాత్రిపూట అరటిపండు తినడం వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. అయితే దగ్గు, జలుబు, ఆస్తమా, సైనస్ వంటి సమస్యలు ఉన్నవారు మాత్రం రాత్రిపూట అరటిపండుకు దూరంగా ఉండాలి. నిద్రపోయే ముందు అరటిపండు తినడం వల్ల శ్లేష్మం పెరిగే ప్రమాదం ఉంది. ఫలితంగా సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.
ఈ సమస్యలున్న రాత్రిపూట అరటి పండు తినకూడదు..
- రాత్రిపూట అరటిపండు తింటే జలుబు వచ్చే అవకాశాలు ఎక్కువ. మీరు ఇప్పటికే జలుబు లేదా దగ్గుతో బాధపడుతున్నట్లయితే మీరు దీనిని అసలు తినకూడదు.
- రాత్రి సమయంలో మెటబాలిజం స్థాయి తక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, అరటిపండు తినడం వల్ల బరువు పెరిగి ఊబకాయం వచ్చే సమస్యలు ఉన్నాయి. పైగా అరటిపండ్లు జీర్ణం కావడానికి సమయం తీసుకుంటుంది. కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు అరటిపండుకు దూరంగా ఉండడమే మేలు.
- ఇక అరటిపండులో క్యాలరీలు పుష్కలంగా ఉంటాయి, రాత్రిపూట అరటిపండ్లు తినడం వల్ల నిద్ర సమస్యలు, అలాగే బద్ధకం ముంచుకొస్తాయి. అలాంటప్పుడు మీరు ఏ పనిపైనా సరిగ్గా దృష్టి పెట్టలేరు.
ఇలా తీసుకుంటే బెటర్..
- కొన్నిసార్లు రాత్రిళ్లు హెవీ ఫుడ్ తీసుకుంటే ఎసిడిటీ, గుండెల్లో మంట వస్తుంది. కాబట్టి పడుకునే ముందు అరటిపండు తింటే ఎసిడిటీ సమస్య ఉండదు.
- కడుపులోని యాసిడ్ ప్రభావాన్ని తగ్గించడంలో అరటిపండు సహాయపడుతుంది.
- మీకు స్వీట్లను తినాలని కోరిక ఉంటే, బదులుగా అరటిపండ్లను తినవచ్చు, ఇది మీ తీపి కోరికలను తగ్గిస్తుంది. అలాగే మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
- మీరు అధిక రక్తపోటు ఉన్న రోగి అయితే, మీరు మీ ఆహారంలో సోడియం మొత్తాన్ని తగ్గించాలి అలాగే పొటాషియం మొత్తాన్ని పెంచాలి, ఈ సందర్భంలో అరటిపండు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. పొటాషియం అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
మరిన్నిహెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..