Baking Soda Benefits: తినేసోడాతో అద్భుతమైన లాభాలు.. ఎలాంటి బెనిఫిట్స్‌ ఉంటాయో తెలిస్తే..

మన వంటిట్లోనే మన ఆరోగ్యాన్ని కాపాడేవి చాలా ఉంటాయి. కానీ పెద్దగా పట్టించుకోము. వంటింట్లో ఉండే పదార్థాలే ఎంతో మేలు చేస్తుంటాయి. వంటింట్లో ఉండే వంట సోడా లాంటివి..

Baking Soda Benefits: తినేసోడాతో అద్భుతమైన లాభాలు.. ఎలాంటి బెనిఫిట్స్‌ ఉంటాయో తెలిస్తే..
Baking Soda

Updated on: Oct 31, 2022 | 8:00 AM

మన వంటిట్లోనే మన ఆరోగ్యాన్ని కాపాడేవి చాలా ఉంటాయి. కానీ పెద్దగా పట్టించుకోము. వంటింట్లో ఉండే పదార్థాలే ఎంతో మేలు చేస్తుంటాయి. వంటింట్లో ఉండే వంట సోడా లాంటివి ఎంతో మేలు చేస్తాయి. దీనిని వంటలతో పాటు ఇంకా ఏయే రకాలుగా వాడుకోవచ్చో చూద్దాం. మన దంతాలు మిలమిలా మెరిసిపోవాలంటే తినే సోడా పని చేస్తుంది. చిటికెడు తినేసోడా తీసుకుని బ్రాష్‌తో దంతాలపై రుద్దుకుంటే దంతాలపై ఉండే రకరకాల గారపట్టిల రంగులను పోయేలా చేస్తుంది.

యాపిల్‌ సైడెన్‌ వెనిగర్‌, తినేసోడా కలిపి తీసుకుంటే బరువు తగ్గడమే కాకుండా బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ కూడా అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నాయి. అయితే కొద్ది పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. శరీరం పై ఏదైనా పురుగు పాకినా, లేదా కుట్టినా ఆ ప్రాంతంలో దురద, నొప్పి, మంట వంటివి చాలా ఉంటాయి. ఈ మంటల నుంచి రక్షించుకోవాలంటే బేకింగ్ పౌడర్ ఎంతగానో పని చేస్తుంది. ఒక స్పూన్ బేకింగ్ పౌడర్‌కి కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌లాగా చేసి ఆ ప్రాంతంలో రాయాలి. నిదానంగా నొప్పి, మంట అన్నీ తగ్గుముఖం పడతాయి.

☛ గుండె మంట లేదా ఏసీడీటీ ఉంటే తినేసోడా ఎంతో పని చేస్తుందట.

ఇవి కూడా చదవండి

☛ ఇది పొట్టలో యాసిడ్లను తరిమికొట్టి గుంటె మంటను తగ్గిస్తుంది.

☛ తినేసోడాను నోట్లో వేసుకుని నీటితో పుక్కిలించి ఊస్తే నోట్లోని వైరస్‌, బ్యాక్టీరియా బయటకు పోతాయి.

☛ మీ చర్మంపై దద్దుర్లు, పొడిబారిపోవడం వంటివి ఉంటే తినేసోడా చర్మంపై రాసుకోండి. చాలా బాగా పని చేస్తుంది.

☛ ఎండాల కాలంలో సన్‌బాత్‌ చేసేవాళ్లు ఇది రాసుకుంటే చర్మం మెరిసేలా ఉంటుంది.

☛ ఈ ప్రయోజనాలు పొందే వారు వైద్యుల సలహాలు తీసుకోవడం తప్పనిసరి.

అందరికీ అన్ని విధాలుగా సెట్‌ కావు. అందుకే తినేసోడా వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వైద్యులను సంప్రదించి వాడటం మంచిది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి