Diabetes Habits: ఈ అలవాట్లు మిమ్మల్ని డయాబెటిస్ పేషెంట్‌గా మారుస్తున్నాయి.. వాటిని వదిలేయడం బెటర్‌

మధుమేహం అనేది నేడు ప్రతి రెండవ మూడవ వ్యక్తిని ప్రభావితం చేసే వ్యాధి. దీనికి ప్రధాన కారణాలలో ఆహారం, జీవనశైలి. డయాబెటిస్ ఇప్పుడు పిల్లల నుండి పెద్దల వరకు అన్ని వయసుల వారిని వేదిస్తోంది..

Diabetes Habits: ఈ అలవాట్లు మిమ్మల్ని డయాబెటిస్ పేషెంట్‌గా మారుస్తున్నాయి.. వాటిని వదిలేయడం బెటర్‌
Diabetes

Edited By:

Updated on: Nov 03, 2022 | 7:34 AM

మధుమేహం అనేది నేడు ప్రతి రెండవ మూడవ వ్యక్తిని ప్రభావితం చేసే వ్యాధి. దీనికి ప్రధాన కారణాలలో ఆహారం, జీవనశైలి. డయాబెటిస్ ఇప్పుడు పిల్లల నుండి పెద్దల వరకు అన్ని వయసుల వారిని వేదిస్తోంది. మధుమేహంలో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. టైప్ 1 డయాబెటిస్ అనేది ఒక రకమైన జన్యుపరమైన రుగ్మత, ఇది ఒక తరం నుండి మరొక తరానికి వ్యాపిస్తుంది. అయితే టైప్ 2 డయాబెటిస్ మీ జీవనశైలి, చెడు అలవాట్ల కారణంగా వస్తుంది. ఒకసారి మధుమేహం వచ్చిదంటే దానిని పూర్తిగా నిర్మూలించలేని పరిస్థితి. జీవనశైలి మార్పులు చేసుకోవడం, ఆహార అలవాట్లను మార్చుకోవడం తప్ప వేరే మార్గం లేదనే చెప్పాలి. కొన్ని అలవాట్లే మిమ్మల్ని డయాబెటిస్‌ పేషెంట్‌గా మారుస్తున్నాయి.

రోజు అల్పాహారంతో ప్రారంభించాలి. ఇది మిమ్మల్ని రిఫ్రెష్‌గా ఉంచుతుంది. కొద్దిగా అల్పాహారం తీసుకోండి మీరు అల్పాహారం తీసుకోకపోతే మీరు మధుమేహం బారిన పడవచ్చు. ఎక్కువ ఆకలితో అలమటిస్తూ, సమయానికి భోజనం చేయకపోవడం వల్ల కూడా మధుమేహం వ్యాపించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆఫీసులో ఒకే చోట పనిచేసేవారు గంటల తరబడి కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌ల ముందు గడుపుతున్నారు. వారు సులభంగా మధుమేహం బారిన పడటానికి ఇది కూడా ఒక కారణం. ఒక వ్యక్తి 1 గంటకు పైగా ఒకే చోట కూర్చుంటే, వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయని పరిశోధనలో తేలింది.

రాత్రి ఆలస్యంగా నిద్రపోతున్నారా..?

రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం కూడా మధుమేహానికి కారణాల్లో ఒకటి. ఈ అలవాటు మీకు హానికరం. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం వల్ల జీవక్రియలు ప్రభావితమవుతాయని, దానివల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయని చాలా పరిశోధనల్లో కూడా ఈ వాస్తవం వెల్లడైంది.

ఇవి కూడా చదవండి

మద్యపానం, ధూమపానం:

మీరు డ్రగ్ అడిక్ట్ అయితే ఈ రోజు ఈ అలవాటు మానేయండి. సాధారణ రోగుల కంటే ధూమపానం, మద్యపానం చేసేవారిలో మధుమేహం వచ్చే అవకాశం 30 నుండి 40 శాతం ఎక్కువ ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలకు కూడా దారి తీస్తుంది.

అతిగా తినడం..

మధుమేహం కేవలం స్వీట్లు తినడం వల్ల మాత్రమే కాకుండా చెడు జీవనశైలి, అధిక ఒత్తిడి కారణంగా కూడా సంభవిస్తుంది. కానీ చక్కెర ఎక్కువగా తినడం వల్ల మధుమేహం వస్తుందన్న విషయాన్ని విస్మరించలేం. కాబట్టి మీరు మధుమేహం బారిన పడకూడదనుకుంటే, స్వీట్‌లకు దూరంగా ఉండండి. చక్కెరకు బదులుగా షుగర్ ఫ్రీ లేదా స్టెవియాను ఉపయోగించడానికి ప్రయత్నించండి. చక్కెరను తక్కువ మొత్తంలో తీసుకోవడం హానికరం కాదు, కానీ పరిమాణం పెరిగేకొద్దీ మధుమేహం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఇది కాకుండా రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, తక్కువ నీరు తాగడం వంటి అలవాట్లను మార్చుకోండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి