ప్రస్తుత కాలంలో పోషకాల లోపం వల్ల చాలామంది పలు సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వాటిలో ఎముకల బలహీనత కూడా ఒకటి. మంచి ఆహారపు అలవాట్లు ఉన్నప్పటికీ ఎముకల ఆరోగ్యం చాలామందిలో మెరుగుపడదు. ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే వెంటనే బోన్ డాక్టర్‌ని కలవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ముందుగా ఆహార శైలిని మార్చుకుంటే ఫలితం ఉంటుందని పేర్కొంటున్నారు. వాస్తవానికి అనారోగ్యకరమైన ఆహారం, పానీయాలు అనేక సమస్యలకు కారణమవుతాయి. దీని కారణంగా శరీరం తక్కువ ప్రయోజనం పొందుతుంది.. ఇంకా ఎక్కువ హాని కలుగుతుంది. పోషకాల లోపం.. అనారోగ్యకరమైన ఆహారం కారణంగా ఎముకలు బలహీనంగా మారడంతోపాటు నిత్యం నొప్పి వస్తుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో శరీరానికి, ఎముకలకు హాని చేసే ఆహారాలు ఏమిటి..? ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉప్పు – చక్కెర ఎక్కువగా తినకండి..
చక్కెర, ఉప్పు మన ఆహారంలో ముఖ్యమైన భాగం. ఇవి లేకుండా ఆహారంలో మంచి రుచిని ఆశించలేము. కానీ ఉప్పు – పంచదార ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం లోపిస్తుంది. దీని వల్ల ఎముకలు బలహీనంగా మారడం మొదలవుతుంది. వీటితో మీ శరీరం అన్ని రకాలుగా బాధను అనుభవిస్తూనే ఉంటుంది. అందువలన ఖచ్చితంగా ఉప్పు, చక్కెరను పరిమితికి మంచి అస్సలు తినకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
కాఫీ తాగడం తగ్గించండి..
నిద్రను దూరం చేసేందుకు, ఇంకా కాస్త రిలాక్స్ కోసం చాలా మంది టీ, కాఫీలు తాగుతారు. కానీ ఈ రెండింటిలో ఉన్న కెఫీన్ అనే మూలకం మన శరీరానికి హాని కలిగిస్తుంది. టీ, కాఫీలు ఎంత ఎక్కువగా తాగితే.. అందులో ఉండే కెఫిన్ మన శరీరంలో ఉండే కాల్షియంను అంత మేర తగ్గిస్తూనే ఉంటుంది. దీని వల్ల ఎముకల్లో నొప్పి వస్తుంది. అదేవిధంగా బీడీ-సిగరెట్లు, గుట్కా నమలడం కూడా మానుకోవాలి. పొగాకులో ఉండే నికోటిన్ కూడా కాల్షియం లోపానికి కారణం.
శీతల పానీయాల వల్ల కాల్షియం లోపం..
చాలా మంది శీతల పానీయాలు లేకుండా పార్టీలు చేసుకోవడానికి, చేయడానికి ఇష్టపడరు. వాస్తవానికి శీతల పానీయాలలో సోడా, హానికరమైన రసాయనాలు కలుపుతారు. దీని వల్ల ఎముకలు చాలా దెబ్బతింటాయి. రోజురోజుకు బలహీనపడటం ప్రారంభమవుతుంది. అంతే కాదు మాంసాహారం తినేవారిలో యానిమల్ ప్రొటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో క్యాల్షియం లోపిస్తుంది. దీని వల్ల శరీరంలో నొప్పి మొదలవుతుంది.
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి