కొంత మంది బరువు తగ్గాలనే ఉద్దేశంతో లేదా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటిస్తున్నామనే కారణంతో బ్రేక్‌ఫాస్ట్ మానేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిల్లో మార్పులు ఏర్పడి మధ్యాహ్నం లేదా సాయంత్రం ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. దీని బదులుగా ప్రోటీన్, ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్ ఉన్న మంచి బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి.
బ్రేక్‌ఫాస్ట్‌లో డోనట్స్, చాక్లెట్ స్ప్రెడ్స్, చక్కెర ఎక్కువగా ఉండేవి తీసుకోవడం చాలా మందికి అలవాటు. ఇవి త్వరగా జీర్ణమై మళ్లీ ఆకలి వేయిస్తాయి. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. బదులుగా గుడ్లు, గ్రీక్ యోగర్ట్, మల్టీగ్రెయిన్ టోస్ట్ వంటి హెల్దీ ఆహారం తీసుకోవాలి.
ఫైబర్ లేని ఆహారం తినడం వల్ల జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయదు. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్‌లో అనియంత్రిత మార్పులకు దారి తీస్తుంది. కాబట్టి బ్రేక్‌ఫాస్ట్‌లో చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, పండ్లు, కూరగాయలు లాంటి హై ఫైబర్ ఆహారం తీసుకోవాలి.
తాజా పండ్ల జ్యూస్ ఆరోగ్యకరంగా అనిపించినా అందులో ఫైబర్ శాతం తక్కువగా ఉంటుంది. దీని వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పండ్లను నేరుగా తినడం ఉత్తమం.
ఉదయాన్నే ప్రోటీన్ తినకపోతే బరువు తగ్గే ప్రాసెస్ మందగిస్తుంది. గుడ్లు, ప్రోటీన్ స్మూతీస్, నట్ బటర్, లీన్ ప్రోటీన్ కలిపిన ఆహారం తీసుకోవడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది.
చాలా మంది ఉదయాన్నే కేవలం టీ లేదా కాఫీ తాగి బ్రేక్‌ఫాస్ట్ మానేస్తారు. దీని వల్ల శరీరానికి అవసరమైన న్యూట్రిషన్ అందదు. బదులుగా గ్రీన్ టీ, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ లేదా న్యూట్రిషియస్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)