శీతాకాలంలో ఈ రోగులకు చాలా ప్రమాదం.. జాగ్రత్తగా లేకపోతే ప్రాణాలకే ముప్పు

|

Oct 26, 2021 | 8:10 AM

Asthma Patients: శీతాకాలంలో ఆస్తమా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. శ్వాసకి సంబంధించిన సమస్యలు వీరిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

శీతాకాలంలో ఈ రోగులకు చాలా ప్రమాదం.. జాగ్రత్తగా లేకపోతే ప్రాణాలకే ముప్పు
Asthma
Follow us on

Asthma Patients: శీతాకాలంలో ఆస్తమా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. శ్వాసకి సంబంధించిన సమస్యలు వీరిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఎందుకంటే కాలుష్యం రోజు రోజుకు పెరుగుతుండటంతో ఆస్తమా రోగులు రోజు రోజుకు పెరుగుతున్నారు. ఆస్తమా ఉన్నవారు ఊపిరితిత్తులను బలోపేతం చేయడానికి శ్వాస వ్యాయామాలు ప్రారంభించాలని నిపుణులు అంటున్నారు. కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లడం మానుకోవాలని సూచిస్తున్నారు. ఉబ్బసం రోగులు అన్ని జాగ్రత్తలు పాటిస్తేనే శీతాకాలం నుంచి తప్పించుకోగలుగుతారని చెబుతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం.. ప్రపంచంలో 235 మిలియన్ల మంది ప్రజలు ఆస్తమాతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి వృద్ధులు, పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. వాహనాల పొగ వల్ల వచ్చే కాలుష్యం కారణంగా ఏటా 40 లక్షల మంది చిన్నారులు ఆస్తమా బారిన పడుతున్నారని ఓ నివేదిక వెల్లడించింది. ఉబ్బసం అంతర్లీన కారణాలు పూర్తిగా అర్థం కాలేదు. కానీ జన్యుపరమైన కారకాలు కాకుండా, అలెర్జీల ఆవిర్భావం కారణంగా ఇది సంభవిస్తుంది.

ఆస్తమా అంటే ఏమిటి
ఆస్తమా అనేది ఊపిరితిత్తుల వ్యాధి. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. శ్వాస గొట్టాలలో వాపు ఉంటుంది. దీని కారణంగా శ్వాస మార్గం ఇరుకుగా మారుతుంది. శ్వాసకోశ సంకుచితం కారణంగా రోగికి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. శ్వాసలో ధ్వని, ఛాతీ బిగుతు, దగ్గు వంటి సమస్యలు మొదలవుతాయి. గాలిలో విపరీతమైన కాలుష్యం కారణంగా ఆస్తమా రోగులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరాడకుండా దగ్గు ఉంటుంది.

ఇలా రక్షించండి
ఆస్తమా రోగులు దుమ్ము, మట్టి లేదా బహిరంగ వాతావరణానికి దూరంగా ఉండాలి. ధూమపానం చేయకూడదు. అంతే కాకుండా చల్లని ప్రదేశాలు, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. ఆస్తమా వ్యాధిగ్రస్తులు బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించాలి. దుమ్ము, ధూళి మీకు శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది ఆస్తమా అటాక్ ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి.

T20 World Cup 2021: న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్‌.. పాకిస్తాన్‌కి మద్దుతు ఇవ్వాలా..! లేదంటే ఏం జరుగుతుంది..?

Fact Check: మీకు టెలికాం శాఖ నుంచి వాట్సప్ మెసేజ్ వచ్చిందా? దానిని తెరిచారంటే ఇక అంతే.. మీ అకౌంట్ ఖాళీ అయిపోతుంది!

News Watch: వారసుడే టీఆర్ఎస్ కాబోయే దళపతి… మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్