Ash Gourd : బూడిద గుమ్మడి చేసే మేలు తెలిస్తే.. పచ్చిదే తినేస్తారేమో

పల్లెటూర్లలో బూడిద గుమ్మడికాయతో వడియాలు పెట్టుకుంటారు. కొందరు హల్వా, ఆగ్రా పేఠా...వంటి స్వీట్లూ చేస్తారు. లేదంటే మజ్జిగ పులుసులో వేస్తారు. ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మం ముందు కడతారు. కానీ బూడిద గుమ్మడిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు ఉన్నాయట. దీంతో ఈ జ్యూస్ తాగేవారి సంఖ్య బాగా పెరిగింది.

Ash Gourd : బూడిద గుమ్మడి చేసే మేలు తెలిస్తే.. పచ్చిదే తినేస్తారేమో
Ash Gourd

Updated on: Jan 22, 2024 | 6:03 PM

బూడిద గుమ్మడి కాయల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. వాటిని ఇంటి ముందు దిష్టి తగలకుండా వేలాడదీస్తారనే చాలామంది అనుకుంటారు. కానీ బూడిద గుమ్మడితో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని జ్యూస్ కింద ఎక్కువమంది తీసుకుంటూ ఉంటారు. 100 గ్రాములు బూడిద గుమ్మడిలో పది గ్రాముల మాత్రమే శక్తి ఉంటుంది. ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది. కానీ విటమిన్స్, మినరల్స్ లెక్కకు మించి ఉంటాయి. బూడిద గుమ్మడిని కూరగా కూడా చేసుకుని తినవచ్చు. పల్లెటూర్లలో అయితే వీటిని ప్రత్యేకంగా పెంచాల్సిన పనిలేదు. అవే విత్తనాలు పడి.. మొలుస్తూ కాయలు కాస్తూ ఉంటాయి. ఉదయాన్నే పరిగడుపున బూడిద గుమ్మడి జ్యూస్ కూడా తాగొచ్చు. అందులో తేనె, నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.

  • హైపర్ ఎసిడిటీ ఉన్నవారికి బూడిద గుమ్మడి జ్యూస్ అద్భుతంగా ఉపయోగపడుతుంది
  • ఇందులో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి
  • బూడిద గుమ్మడి కాయ విటమిన్ B3ని కలిగి ఉంటుంది, ఇది శక్తి స్థాయిలను పెంచుతుంది. కాబట్టి, రక్తహీనతతో బాధపడేవారికి, శరీరంలో బలహీనత ఉన్నవారికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
  • అధిక ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహారాలు ప్రేగు ఆరోగ్యానికి ఉపకరిస్తాయ. బూడిద పొట్లకాయలో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మంచి బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహిస్తుంది. అజీర్ణం కలిగించే మలబద్ధకం, హెమోరాయిడ్స్ మొదలైనవాటిని తగ్గిస్తుంది. తద్వారా పెద్దప్రేగు ఆరోగ్యంగా ఉంటుంది.
  • సాంప్రదాయ వైద్యంలో బూడిద పొట్లకాయ శరీరంపై శీతలీకరణ ప్రభావాన్ని కలిగిస్తుంది. శరీరంలోని వేడిని చల్లబరుస్తుంది.
  •  బూడిద గుమ్మడిలో కాల్షియం, ఐరన్‌, ఫాస్ఫరస్‌, జింక్‌, పొటాషియం, మెగ్నీషియం… వంటి ఖనిజాలూ ఉంటాయి.
  •  వృద్ధాప్యానికి కారణమైన ఫ్రీరాడికల్స్‌తో పోరాడే గుణాలూ దీనికి ఉన్నాయి. ఈ రసాన్ని క్రమం తప్పక తీసుకునేవాళ్లలో చర్మం తాజాగా ఉంటుంది.
  •  నిద్రలేమి, కుంగుబాటు, ఆందోళన, మూర్ఛ… ఇతరత్రా నాడీ సమస్యల్ని  బూడిద గుమ్మడిలోని గ్లైకోసైడ్స్‌, స్టెరాల్స్‌ నివారిస్తాయి.
  • కిడ్నీల పనితీరుని పెంచే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా బూడిద గుమ్మడిలో పుష్కలమే.
  • కాలేయ సమస్యల్నీ నివారిస్తుందీ బూడిదగుమ్మడి రసం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

ఇవి కూడా చదవండి