Health Tips: ఆర్థరైటిస్‌ రోగులు ఈ ఆహార పదార్థాలని అస్సలు తినవద్దు.. ఎందుకంటే..?

|

May 14, 2022 | 6:31 AM

Health Tips: కీళ్లనొప్పులని వైద్య భాషలో ఆర్థరైటిస్ అని పిలుస్తారు. ఇది చాలా సాధారణ ఆరోగ్య సమస్య. పెరుగుతున్న వయస్సుతో, ఎముకలు బలహీనపడటం ప్రారంభించినప్పుడు

Health Tips: ఆర్థరైటిస్‌ రోగులు ఈ ఆహార పదార్థాలని అస్సలు తినవద్దు.. ఎందుకంటే..?
Arthritis Patients
Follow us on

Health Tips: కీళ్లనొప్పులని వైద్య భాషలో ఆర్థరైటిస్ అని పిలుస్తారు. ఇది చాలా సాధారణ ఆరోగ్య సమస్య. పెరుగుతున్న వయస్సుతో, ఎముకలు బలహీనపడటం ప్రారంభించినప్పుడు కీళ్లలో నొప్పి సమస్యలు మొదలవుతాయి. వృద్ధాప్యం, కండరాల బలహీనత, ఊబకాయం, అనేక ఇతర కారణాల వల్ల ప్రజలు ఆర్థరైటిస్ సమస్యలను కలిగి ఉంటారు. ఇది దీర్ఘకాలిక వ్యాధి. ఇది నెమ్మదిగా పెరుగుతుంది. పూర్తిగా వదిలించుకోవటం చాలా కష్టం. కానీ వాపు, నొప్పి వంటి సమస్యలను సరైన ఆహారాలు తినడం ద్వారా తగ్గించుకోవచ్చు. ఆర్థరైటిస్ సమస్య ఎదిగే వయసులో ఎవరికైనా రావచ్చు. అయితే ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో మహిళలు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం అవసరం. కాబట్టి ఆర్థరైటిస్ రోగులు కొన్ని ఆహారాలకి దూరంగా ఉండాలి. అలాంటి ఆహారాల గురించి తెలుసుకుందాం.

ఎర్రటి మాంసం

మీరు ఆర్థరైటిస్ నొప్పితో బాధపడుతుంటే ప్రాసెస్ చేసిన రెడ్ మీట్‌కు దూరంగా ఉండాలి. ఇది మీ శరీరంలో మంటను పెంచుతుంది. దీని కారణంగా మీకు మరింత నొప్పి, వాపు ఉంటాయి. అంతేకాదు ప్రాసెస్ చేసిన మాంసంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా మీరు వాపు సమస్యలు తలెత్తుతాయి. దీనిని తీసుకోకపోవడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు.

చక్కెర

ఆర్థరైటిస్‌తో బాధపడేవారు తీపి పానీయాలకి దూరంగా ఉండాలి. తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల సమస్య మరింత జఠిలమవుతుంది. అధిక చక్కెర వినియోగం గుండె జబ్బులతో మరణించే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఇది ఊబకాయం, వాపు, ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక నొప్పులకి కారణమవుతుంది.

ప్రాసెస్ చేసిన ఆహారం

ఫాస్ట్ ఫుడ్, కాల్చిన ఆహారం, ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్థాలలో చక్కెరలు, ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కీళ్ల నొప్పులని మరింత పెంచుతాయి. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం సమస్య పెరుగుతుంది. ఇది మీ కీళ్లపై అదనపు భారం వేసి నొప్పిని మరింత పెంచుతుంది.

అధిక ఉప్పు ఆహార పదార్థాలు

ఆర్థరైటిస్‌తో బాధపడేవారు ఎక్కువ ఉప్పు తీసుకోవడం హానికరం. రొయ్యలు, క్యాన్డ్ సూప్, పిజ్జా, ప్రాసెస్ చేసిన మాంసం వంటి వాటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉంటే మంచిది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

RCB vs PBKS: చిత్తుగా ఓడిన బెంగుళూరు.. 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన పంజాబ్‌

Delhi Fire Accident: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. 26 మంది మృతి.. పలువురికి గాయాలు..

Vikram Controversy: కమల్‌ హాసన్‌ విక్రమ్ సినిమా సాంగ్‌పై రచ్చ.. కొన్ని పదాలకి భిన్నమైన అర్థాలు..!