వెన్ను నొప్పి భరించలేకపోతున్నారా..అయితే కారణాలు ఇవే కావచ్చు..నెగ్లెక్ట్ చేయకండి..

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరిలోనూ బ్యాక్ పెయిన్ అనేది సర్వసాధారణంగా అయిపోయింది ముఖ్యంగా ఆఫీసుల్లో వర్క్ చేసే వారిలో ఈ బ్యాక్ పెయిన్ సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది.

వెన్ను నొప్పి భరించలేకపోతున్నారా..అయితే కారణాలు ఇవే కావచ్చు..నెగ్లెక్ట్ చేయకండి..
Back Pain

Edited By: Phani CH

Updated on: Jun 05, 2023 | 9:53 AM

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరిలోనూ బ్యాక్ పెయిన్ అనేది సర్వసాధారణంగా అయిపోయింది. ముఖ్యంగా ఆఫీసుల్లో వర్క్ చేసే వారిలో ఈ బ్యాక్ పెయిన్ సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవడం కూడా ఇందుకు ఒక కారణంగా హెచ్చరిస్తున్నారు. నిజానికి వెన్నునొప్పి అనేది అనేక ప్రమాదాలకు సంకేతం అని డాక్టర్లు చెబుతున్నారు అందులో ప్రధానంగా, బ్యాక్ పెయిన్ వల్ల కేవలం నడుము నొప్పి మాత్రమే కాదు దాని వెనుక అనేక కారణాలు ఉండవచ్చని చెబుతున్నారు.

కిడ్నీ సమస్య ఉండే అవకాశం:

కిడ్నీ సమస్యలు ఏర్పడినప్పుడు కూడా బ్యాక్ పెయిన్ అనేది మనం అనుభవించగలం. ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు కూడా బ్యాక్ పెయిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే కిడ్నీ ఇన్ఫెక్షన్ల సమయంలో కూడా మనం ఈ బ్యాక్ పెయిన్ సమస్యను తరచూ చూస్తూ ఉంటాం. అందుకే బ్యాక్ పెయిన్ వచ్చిన వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి సలహా తీసుకోవడం మంచి పని అని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సయాటిక:

సయాటికా సమస్య ఏర్పడినప్పుడు కూడా తీవ్రమైన వెన్ను నొప్పి అనేది కనిపిస్తుంది. . ముఖ్యంగా సయాటికా సమస్యలో పిరుదులు, కాలు వెనుక భాగంలో నొప్పిని కలిగిస్తుంది. దీన్ని గుర్తించిన వెంటనే ఆర్థోపెడిక్ వద్దకు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంటే మంచిది.

ఆర్థరైటిస్:

ఇది హిప్స్, లోయర్ బ్యాక్, సహా శరీరంలోని ఇతర ప్రాంతాలలో కీళ్లతో చాలా సమస్యలను కలిగిస్తుంది. ఒకవేళ ఈ ప్రాంతాల్లో మీరు నొప్పి గనుక అనుభవిస్తే వెంటనే వైద్యుడికి చూపించుకోవడం మంచిది. తద్వారా ప్రాథమిక దశలోనే ఆర్థరైటిస్ ను గుర్తించి సరైన చికిత్సను ప్రారంభించే అవకాశం ఉంటుంది.

పగిలిన డిస్కులు:

వెన్నెముకకు గాయం అయినట్లయితే, అది నరాల మీద ఒత్తిడిని కలిగించే డిస్క్‌ను చీల్చుతుంది, ఫలితంగా వెన్నునొప్పి వస్తుంది.

దీంతోపాటుగా వెన్నునొప్పిని అంతా తేలిగ్గా తీసుకోకూడదు. ఒకవేళ మీరు వయసులో చిన్నవారు అయినప్పటికీ వెన్నునొప్పి ప్రారంభమైతే మాత్రం వెంటనే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మంచిది. . ముఖ్యంగా శరీరం బరువు బిఎంఐ చేసుకుంటే మంచిది. . ఎత్తుకు తగ్గ బరువు అనేది మెయిన్ టెయిన్ చేయాలి. అప్పుడే మీరు వెన్నునొప్పి భారి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక గంటల తరబడి కూర్చొని సాఫ్ట్ వేర్ జాబ్స్ చేయాల్సినవారు. ప్రతి 60 నిమిషాల తర్వాత కుర్చీలోంచి లేచి ఐదు నిమిషాల పాటు వాకింగ్ చేస్తే మంచిది. . అప్పుడు వెన్నునొప్పి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది.

యోగాసనాల్లో కూడా వెన్నునొప్పి బారిన పడకుండా అనేక ఆసనాలు ఉన్నాయి. త్రికోణాశనం వేయడం వల్ల వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే సూర్య నమస్కారాలు వల్ల కూడా వెన్ను నొప్పిని దూరం చేసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు శవాసనం వేయడం వల్ల వెన్నులోని కండరాలకు ఉపశమనం కలుగుతుంది తద్వారా వెన్నునొప్పి నుంచి బయటపడవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం