Food For Strong Bones: 30 ఏళ్లకే ఎముకల్లో పటుత్వం కోల్పోయి ఢీలా పడుతున్నారా.? అయితే మీరు ఇది పాటించాల్సిందే..

Food For Strong Bones: ఇటీవలి కాలంలో చాలా మంది ఎముకల్లో పటుత్వం కోల్పోయి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. పట్టుమని 30 ఏళ్లు నిండని వారు కూడా కీళ్లు, ఎముకల నొప్పులతో ఉసూరుమంటున్నారు. చిన్న వస్తువును కూడా...

Food For Strong Bones: 30 ఏళ్లకే ఎముకల్లో పటుత్వం కోల్పోయి ఢీలా పడుతున్నారా.? అయితే మీరు ఇది పాటించాల్సిందే..
Healthy Bones

Updated on: Apr 02, 2021 | 6:39 PM

Food For Strong Bones: ఇటీవలి కాలంలో చాలా మంది ఎముకల్లో పటుత్వం కోల్పోయి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. పట్టుమని 30 ఏళ్లు నిండని వారు కూడా కీళ్లు, ఎముకల నొప్పులతో ఉసూరుమంటున్నారు. చిన్న వస్తువును కూడా ఇటు నుంచి అటు పెట్టడానికి అలసటగా ఫీలవుతున్నారు. ఈ క్రమంలోనే ఎముకల్లో ధృడత్వాన్ని పెంచుకోవడానికి ఔషధాలు, మార్కెట్లో దొరికే రకరకాల పౌడర్ల వెంట పడుతున్నారు. అయితే మీరు తీసుకునే ఆహారం ద్వారానే ఈ సమస్యకు చెక్‌ పెట్టవచ్చనే విషయం మీకు తెలుసా.? ఎలాంటి ఆహార పదార్థాలతో ఎముకలకు అవసరమయ్యే పోషకాలు అందుతాయో ఇప్పుడు చూద్దాం..

* ఎముకలు బలహీనంగా మారడానికి ప్రధాన సమస్య కాల్షియం లోపం. కాబట్టి కాల్షియం పుష్కలంగా లభించే పాలను కచ్చితంగా తీసుకోవాలి. టీ, కాఫీ అలవాటు ఉన్న వారు వాటికి బదులుగా పాలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి.

* కాల్షియం ఎక్కువగా లభించే ఆహార పదార్థాల్లో నారింజ కూడా ఒకటి. ఒక నారింజ పండులో సుమారు 60 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్‌ D కూడా ఎముకల ధృడత్వానికి దోహదపడుతుంది.

* అంజీర పండ్లను మీ రోజువారీ డైట్‌లో భాగం చేసుకుంటే ఎముకల సమస్యకు చెక్‌పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే కాల్షియం ఎముకలను గట్టి పరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

* ఇక ఎముకలు బలహీనంగా మారడానికి మరో ప్రధాన కారణం విటమిన్‌ డీ లోపం. మారుతోన్న జీవన శైలి, ఇంటి నిర్మాణల శైలి కారణాల వల్ల శరీరానికి సరిపడ సూర్య రష్మి అందడం లేదు. దీనివల్ల ఎముకలు బలహీనంగా మారుతున్నాయి కాబట్టి విటమిన్‌ డి ఎక్కువగా లభించే చేపలు, కోడిగుడ్లు, పాలు, పాల పదార్థాలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి.

* అధిక బరువు కూడా ఎముకలపై దుష్ఫ్రభావం చూపుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఊబకాయం బారిన పడకుండ చూసుకోవాలి.

* క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కూడా ఎముకల పటుత్వం పెరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న నాటి నుంచే వ్యయామం చేయడం ఒక అలవాటుగా మార్చుకోవాలి.

Also Read: ఆదిలాబాద్ రంజాన్లకు భలే గిరాకీ.. నీటిని చల్లబరచడమే కాదు.. ఇంకా చాలా విషయాల్లో బెటర్‌.. ఏంటో తెలుసుకోండి..

Benefits of Amaranth: ఈజీగా బరువు తగ్గాలనుకుంటున్నారా..! అయితే ఈ ఆకుకూరని ట్రై చేయండి

Mushroom Curry Recipe: పోషకాల నిలయం పుట్టగొడుగులు.. ఆంధ్ర స్టైల్ లో మష్రూమ్స్ మాంసాల కూర తయారీ విధానం..