Anemia: తరచూ తలనొప్పి, చిరాకు, అలసటగా ఉందా.? అయితే మీరు రక్త హీనతతో బాధపడుతున్నట్లే. దీనిని ఎలా అధిగమిచాలంటే.

|

Sep 02, 2021 | 1:18 PM

Anemia: కొందరు నిత్యం తలనొప్పి, చికాకు, త్వరగా అలసిపోవడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అయితే ఈ సమస్య దాదాపు మనందరిలో ఇలాంటి లక్షణాలు ఏదో ఒక క్షణంలో కనిపించినా...

Anemia: తరచూ తలనొప్పి, చిరాకు, అలసటగా ఉందా.? అయితే మీరు రక్త హీనతతో బాధపడుతున్నట్లే. దీనిని ఎలా అధిగమిచాలంటే.
Anemia
Follow us on

Anemia: కొందరు నిత్యం తలనొప్పి, చికాకు, త్వరగా అలసిపోవడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అయితే ఈ సమస్య దాదాపు మనందరిలో ఇలాంటి లక్షణాలు ఏదో ఒక క్షణంలో కనిపించినా కొందరు మాత్రం నిత్యం ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. అయితే ఇలా ఎప్పుడూ ఉంటే మాత్రం లైట్‌గా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది రక్తహీనతకు సూచికగా భావించాలి. శరీరంలో సరిపడ రక్తం లేకుంటే ఇలాంటి సమ్యలన్నో చుట్టుముడుతుంటాయి. శరీరంలో తగినన్ని ఎర్ర రక్త కణాలు లేకపోతే రక్తం తయారు కాదు.. దీనివల్ల శరీర భాగాలకు ఆక్సిజన్‌ సరిగ్గా అందదు. ఓ సర్వే ప్రకారం దాదాపు 68 శాతం మంది పిల్లలు, 66 శాతం మంది మహిళలు రక్త హీనత సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. రక్తహీనతకు మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడమే కారణమే విషయం మీకు తెలుసా.? రక్త హీనతతో బాధపడుతున్న వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

* రక్తహీనతతో బాధపడే వారు సిట్రస్‌ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. నారింజ పండ్లు, బీన్స్‌ వంటి వాటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. విటమిన్‌ సి ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్‌ వృద్ధి చెందుతుంది.

* ఆకుపచ్చని కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్త హీనత సమస్య నుంచి బయటపడొచ్చు. వీటిలో ఉండే ఐరన్‌ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

* అవిసె గింజలు, గుమ్మడి కాయ విత్తనాలు, జీడిపప్పు, పిస్తాలు, తృణ ధాన్యాలను నిత్యం తీసుకోవాలి ఇలా చేయడం వల్ల రక్త హీనతకు చెక్‌ పెట్టొచ్చు.

* సముద్రపు, చేపలు, పీతలు, రొయ్యల వల్ల కూడా ఐరన్‌ లభిస్తుంది.

* మీకు మాంసహారం అలవాటు ఉన్నట్లయితే మటన్‌ లివర్‌, మటన్‌ను తీసుకుంటే శరీరానికి అవసరమైన ఐరన్‌ను పొందొచ్చు. లివర్‌లో ఐరన్‌, ఫోలేట్‌ ఎక్కువగా ఉంటాయి. దీంతో శరీరానికి అవసరమైన ఐరన్‌ పుష్కలంగా లభిస్తుంది.

* బీట్‌రూట్‌ వంటి ఎరుపు రంగులో ఉండే కూరగాయలను తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం బాగా తయారవుతుంది.

Also Read: Money Heist: మనీ హెయిస్ట్‌ వెబ్‌ సిరీస్‌కు ఉన్న క్రేజ్‌కు ఇది ప్రత్యక్ష ఉదాహరణ.. విడుదల నేపథ్యంలో ఏకంగా..

Nagarkurnool: గుత్తేదార్ల గుట్టు రట్టైంది.. కోట్ల రూపాయల ప్రజా సంపద కొట్టుకుపోయి సాక్ష్యంగా నిలిచింది

Viral Photo: ఒంటిని విల్లులా వంచేస్తున్న ఈ నటి ఎవరో గుర్తుపట్టారా? ఒకప్పుడు బొద్దుగుమ్మగా..