Indigestion
ఆధునిక జీవన శైలికి అలవాటు పడిన వారిలో రకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి . అజీర్ణం అనేది చాలా మందిని వేధించే సమస్య. ఈ సమస్య ఉన్నప్పుడు, తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, వికారం, గుండెల్లో మంట, వాంతులు వంటి ఇతర లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమయంలో ఏమీ అక్కర్లేదని అనిపించడం సహజం. ఇలాంటప్పుడు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం మంచిది. ఇంట్లో ఉండే వస్తువులతో అజీర్తి సమస్యను అధిగమించవచ్చు .
అజీర్ణం కోసం ఇంటి నివారణలు:
- మజ్జిగలో ఉప్పు కలిపి రోజూ తాగితే అజీర్తి సమస్య కూడా తీరుతుంది.
- భోజనం తర్వాత అల్లం నమలడం వల్ల కూడా అజీర్ణం నయమవుతుంది.
- భోజనం తర్వాత అరటిపండు తినడం వల్ల అజీర్తి సమస్యను దూరం చేసుకోవచ్చు.
- ఎండుమిర్చి, వెల్లుల్లిని కొద్ది మొత్తంలో కలిపి వేయించి భోజనంలో తీసుకుంటే జీర్ణశక్తి కూడా మెరుగై అజీర్తి సమస్య దరిచేరదు.
- భోజనానికి ముందు కొన్ని జీలకర్రను నోటిలో వేసుకుని నమిలితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
- నిమ్మరసాన్ని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి రోజుకు మూడుసార్లు సేవిస్తే అజీర్తి తగ్గుతుంది.
- నిమ్మరసం తాగడం వల్ల అజీర్ణం వల్ల వచ్చే పులుపు నుంచి ఉపశమనం లభిస్తుంది.
- రోజూ యాపిల్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
- పసుపు పొడిని వంటలో కలపడం వల్ల కూడా అజీర్ణం తగ్గుతుంది.
- భోజనం తర్వాత ఏలకులను బాగా నమిలితే అజీర్తి సమస్య దూరమవుతుంది.
- పుదీనా ఆకులను రోజూ నమలడం వల్ల ఆహారం జీర్ణమై అజీర్తి సమస్య దరిచేరదు.
- తులసి రసాన్ని రోజూ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
- అజీర్తి సమస్య ఉన్నప్పుడు లవంగాలను కషాయం చేసి తాగితే మంచిది.
- భోజనం చేసిన తర్వాత పొట్టు తీసిన ఖర్జూరాన్ని తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి