AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Life style: రాత్రి పడుకునే ముందు గ్లాస్‌ గోరు వెచ్చని నీరు తాగండి.. వారంలో ఈ తేడాలు కనిపిస్తాయి

శరీరంలో అన్నిభాగాలు సక్రమంగా పనిచేయాలన్నా, డీహైడ్రేషన్‌కు గురికాకుండా శరీరం నిత్యం హైడ్రేట్‌గా ఉండాలన్నా కచ్చితంగా నీటిని తీసుకోవాలని చెబుతుంటారు. అయితే గోరువెచ్చని నీరు తాగడం వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతుంటారు. ప్రతీ రోజూ రాత్రి ఒక గ్లాసు గోరు వెచ్చిన నీరు తాగడం...

Life style: రాత్రి పడుకునే ముందు గ్లాస్‌ గోరు వెచ్చని నీరు తాగండి.. వారంలో ఈ తేడాలు కనిపిస్తాయి
Warm Water
Narender Vaitla
|

Updated on: Feb 04, 2024 | 6:41 PM

Share

శరీరానికి మంచి నీరు ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జీవక్రియలన్నీ సక్రమంగా పనిచేయాలంటే కచ్చితంగా తగినంత నీరు తీసుకోవాలని చెబుతుంటారు. వైద్యుల సూచన ప్రకారం ప్రతీ రోజూ కనీసం 6 నుంచి 8 లీట్ల నీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. శరీరంలో అన్నిభాగాలు సక్రమంగా పనిచేయాలన్నా, డీహైడ్రేషన్‌కు గురికాకుండా శరీరం నిత్యం హైడ్రేట్‌గా ఉండాలన్నా కచ్చితంగా నీటిని తీసుకోవాలని చెబుతుంటారు. అయితే గోరువెచ్చని నీరు తాగడం వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతుంటారు. ప్రతీ రోజూ రాత్రి ఒక గ్లాసు గోరు వెచ్చిన నీరు తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఒక వారం రోజులు గోరు వెచ్చని నీరు తాగితే చాలు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. ఇంతకీ గోరు వెచ్చని నీరు తాగడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం..

* గోరువెచ్చని నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం డిటాక్స్‌ను పొందుతుంది. బరువు తగ్గడమే కాకుండా శరీరంలోని వ్యర్థ పదార్థాలన్నీ తొలగిపోతాయి. రాత్రి భోజనం చేసిన అరగంట తర్వాత, నిద్రించడానికి ఒకటి లేదా రెండు గంటల ముందు గోరువెచ్చని నీటిని తాగితే.. శరీర జీర్ణక్రియ మెరుగవుతుంది.

* గోరవెచ్చని నీటిని తీసుకోవడం వల్ల వల్ల రోజంతా శరీరం చురుకుగా ఉంటుంది. అలాగే గోరువెచ్చని నీటిలో 2 చుక్కల నిమ్మరసం కలిపితే శరీరానికి మరింత శక్తి అందుతుంది.

* జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు గోరు వెచ్చని నీరు ద్వారా దూరమవుతాయి. జీర్ణక్రియకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే, నిద్రపోయే ముందు ప్రతిరోజూ గోరువెచ్చని నీటిని తాగండి. మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. వేడినీరు తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.

* రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిని తాగితే ఒత్తిడి, డిప్రెషన్‌ తగ్గుముఖం పడతాయి. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీరు తాగితే మంచి నిద్ర సొంతమవుతుంది.

* గోరువెచ్చని నీటిని తాగడం వల్ల చర్మంపై ముడతలు దూరమవుతాయి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిని తాగాలి, దీని కారణంగా చర్మం బిగుతుగా మారుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం.

Follow Us
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి