Digestion Tips: తిన్నది అరగక ఇబ్బంది పడుతున్నారా.. ఈ డ్రింక్స్ తాగండి.. హాయిగా ఉండండి!

|

Aug 12, 2023 | 10:37 AM

ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగు జీవితంలో టైమ్ కి తినడానికి కూడా సమయం దొరకడం లేదు. దీంతో తినే వేళల్లో మార్పులు వస్తున్నాయి. టిఫిన్ 11కి , లంచ్ 2 లేదా 3 గంటలకు ఇక డిన్నర్ అయితే 10 ఆపై తింటున్నారు. ఇలా టైమ్ కాని టైమ్ కి తింటే జీర్ణ వ్యవస్థ అయినా ఎలా తట్టుకుంటుంది. అందులోనూ ఈ మధ్య ఫాస్ట్ ఫుడ్ కి ఎక్కువగా అలవాటు పడ్డారు జనం. ప్రాసెస్ చేసిన ఆహారం తినడం, అలాగే ఇంట్లోని సమస్యలు, ఒత్తిడి, ఆందోళనలకు గురి కావడం వలన కూడా జీర్ణ సమస్యలు..

Digestion Tips: తిన్నది అరగక ఇబ్బంది పడుతున్నారా.. ఈ డ్రింక్స్ తాగండి.. హాయిగా ఉండండి!
Digestion tips
Follow us on

ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగు జీవితంలో టైమ్ కి తినడానికి కూడా సమయం దొరకడం లేదు. దీంతో తినే వేళల్లో మార్పులు వస్తున్నాయి. టిఫిన్ 11కి , లంచ్ 2 లేదా 3 గంటలకు ఇక డిన్నర్ అయితే 10 ఆపై తింటున్నారు. ఇలా టైమ్ కాని టైమ్ కి తింటే జీర్ణ వ్యవస్థ అయినా ఎలా తట్టుకుంటుంది. అందులోనూ ఈ మధ్య ఫాస్ట్ ఫుడ్ కి ఎక్కువగా అలవాటు పడ్డారు జనం. ప్రాసెస్ చేసిన ఆహారం తినడం, అలాగే ఇంట్లోని సమస్యలు, ఒత్తిడి, ఆందోళనలకు గురి కావడం వలన కూడా జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, గ్యాస్ వంటి ప్రాబ్లమ్స్ కూడా ఎదురవుతాయి. మరి వీటికి చెక్ పెట్టాలంటే ఈ చిట్కాలు పాటించండి. మరి అవేంటో తెలుసుకుందామా.

నిమ్మరసం:

నిమ్మకాయు ఆహారాన్ని అరిగించే గుణం ఎక్కువగా ఉంటుంది. అందుకే మీరు మసాలా ఐటెమ్స్ కానీ, నాన్ వెజ్ ఐటెమ్స్ కానీ తింటే నిమ్మకాయను ఇస్తారు. అది పిండుకుని తింటే ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. మీకు తిన్న ఆహారం ఎప్పుడైనా అరగలేదు అనిపించినా, కడుపు ఉబ్బరంగా ఉన్నా.. ఓ గ్లాసుడు నిమ్మరసం తాగండి. కాస్త ఉపశమనంగా అనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

సోంపు:

సోంపు కూడా ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. తరుచుగా ఇదితింటూ ఉంటే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నారు. మనం హోటళ్లకి వెళ్లినప్పుడు కూడా ఆహారం తినేశాక.. సోంపు డబ్బాను తీసుకువస్తారు. ఆహారం తిన్న తర్వాత దీన్ని తీసుకుంటే.. త్వరగా అరిగేలా చేస్తుంది. ఇది పెద్ద పేగును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒక గ్లాస్ వాటర్ లో ఒక స్పూన్ సోంపును వేసి.. ఓ 5 నిమిషాలు మరిగించి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే.. అజీర్తి, ఎసిడిటీని దూరంగా ఉంచుతుంది.

జీలకర్ర:

ఆహారాన్ని జీర్ణం చేయడంలో జీలకర్ర ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులో పోటాషియం, విటమిన్ ఏ, విటమిన్ సీ, కాల్షియం, ఐరన్ వంటివి ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇది మార్నింగ్ సిక్ నెస్ ని, కడుపు నొప్పిని, విరేచనాలను దూరం చేస్తుంది. అప్పుడప్పుడు ఓ స్పూన్ జీలకర్రని రాత్రంతా.. ఓ గ్లాసుడు నీటిలో నానబెట్టి.. ఉదయాన్నే పరగడుపున తాగితే మంచి రిజల్ట్ కనిపిస్తుంది.

అల్లం:

అల్లం కూడా జీర్ణ వ్యస్థను సక్రమంగా పనిచేసే విధంగా చేస్తుంది. లాలాజలం, పైత్యరస ఉత్పత్తిలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. తిన్న ఆహారాన్ని సులభంగా అరిగేందు, బయటకు పంపడంలో కూడా సహాయపడుతుంది. అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా తరిమి.. గ్లాసు నీటిలో వేసి అరగ్లాసు వచ్చేంత వరకూ మరిగించాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు.. కావాలంటే తేనె కాస్త కలుపుకుని తాగితే అజీర్తి తగ్గుతుంది.

పుదీనా, తులసి:

పుదీనా, తులసిలోని జీర్ణక్రియను మెరుగుపరిచే ఔషధ గుణాలు ఉన్నాయి. పుదీనా, తులసి ఆకులను శుభ్రంగా కడిగి.. పావు లీటర్ నీటిలో వేసి.. అవి సగం వరకూ అడిగే వరకు మరిగించాలి. కాస్త గోరు వెచ్చగా అయిన తర్వాత వాటిని తరచూ తాగితే జీర్ణ సమస్యలు తగ్గడమే కాదు.. శరీరంలోని మలినాలు తొలగిపోతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి