Stretch Marks: స్ట్రెచ్ మార్క్స్ తో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి!!

|

Sep 02, 2023 | 5:04 PM

చాలా మందికి స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. బరువులు మోసినప్పుడు చంకలు, తొడలు, పొత్తి కడుపు భాగాల్లో స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. అందులోనూ డెలీవరీ అయ్యాక మహిళలకు పొత్తి కడుపుపై స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువగా కనిపిస్తాయి. దీంతో చాలా ఇబ్బంది పడుతూంటారు. వీటిని తగ్గించుకునేందుకు క్రీమ్స్ వాడతారు. దీంతో తగ్గినప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఇలా నేచురల్ గా హోమ్ రెమిడీస్ ని వాడి తగ్గించుకోవచ్చు. దీంతో డబ్బు కూడా ఆదా అవుతుంది. మరి ఇంకెందుకు లేట్ అవేంటో..

Stretch Marks: స్ట్రెచ్ మార్క్స్ తో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి!!
Stretch Marks
Follow us on

చాలా మందికి స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. బరువులు మోసినప్పుడు చంకలు, తొడలు, పొత్తి కడుపు భాగాల్లో స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. అందులోనూ డెలీవరీ అయ్యాక మహిళలకు పొత్తి కడుపుపై స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువగా కనిపిస్తాయి. దీంతో చాలా ఇబ్బంది పడుతూంటారు. వీటిని తగ్గించుకునేందుకు క్రీమ్స్ వాడతారు. దీంతో తగ్గినప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఇలా నేచురల్ గా హోమ్ రెమిడీస్ ని వాడి తగ్గించుకోవచ్చు. దీంతో డబ్బు కూడా ఆదా అవుతుంది. మరి ఇంకెందుకు లేట్ అవేంటో తెలసుకోండి.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్ ని డైలీ చర్మం పై రాస్తే డార్క్ స్పాట్స్, మచ్చలు తగ్గిపోతాయి. అలాగే స్ట్రెచ్ మార్క్స్ కూడా తగ్గుతాయి. ఆలివ్ ఆయిల్ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. అలాగే ఫ్రెష్ గా తాజాగా ఉంచుతుంది. ఈ ఆయిల్ ని గోరు వెచ్చగా వేడి చేసి, స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట రాసి వదిలేయాలి. అరగంట తర్వాత దాన్ని గోరు వెచ్చటి నీటితో క్లీక్ చేసుకున్నా.. లేక గోరు వెచ్చటి నీటితో స్నానం చేసినా పర్వాలేదు.

ఇవి కూడా చదవండి

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె కూడా స్ట్రెచ్ మార్క్స్ కి బాగా పని చేస్తుంది. స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది కొబ్బరి నూనె. కాస్త గోరు వెచ్చగా ఉన్న కోకోనెట్ ఆయిల్ ని స్ట్రెచ్ మార్క్స్ పై రాసి, కాసేపు మసాజ్ చేయాలి. ఇలా డైలీ రాసుకుంటే.. స్ట్రెట్ మార్క్స్ తగ్గుతాయి.

బంగాళ దుంప రసం:

ఆలు గడ్డలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మంపై ఉన్న నలుపును తగ్గిస్తుంది. బంగాళ దుంప రసాన్ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట రాస్తే త్వరగా తగ్గుతాయి. ఆలు గడ్డ రసాన్ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట రాసి.. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే స్ట్రెచ్ మార్క్స్ తగ్గిపోతాయి.

కోడి గుడ్డు:

కోడి గుడ్డులో ప్రోటీన్ అధికంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. గుడ్డులోని తెల్లసొన చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. చర్మంపై ముడతలు, స్ట్రెచ్ మార్క్స్ ని పోగొట్టడంలో సహాయపడుతుంది. గుడ్డులోని తెల్లసొనని సపరేట్ చేసి, ఇందులో ఒక స్పూన్ గ్లిజరిన్ కలపాలి. ఈ రెండింటినీ కలిపి బాగా బీట్ చేయాలి. ఆ తర్వాత దీన్ని స్ట్రెచ్ మార్క్స్ వద్ద రాసి ఆరిపోయాక నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే ఈ సమస్య తగ్గుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి