వెయిట్ లాస్ అవ్వాలని, ఎప్పుడూ ఫిట్ గా ఉండాలని.. ఇప్పుడు చాలా మంది తమ ఆహారంలో నట్స్, సీడ్స్, మొలకెత్తిన విత్తనాలను తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే ఫ్రూట్స్, పచ్చి కూరగాయలు తింటూ.. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నారు. అలా తీసుకునే సీడ్ ఫుడ్ లో గుమ్మడి విత్తనాలు కూడా ఒకటి. చూడటానికి గ్రీన్ కలర్ లో ఉన్నాయి కాబట్టి చేదుగా ఉంటాయని అనుకోకండి. బాదంపప్పు లాగే టేస్టీగా ఉంటాయి. వీటి వల్ల శరీరానికి ఎలాంటి ఉపయోగాలున్నాయి.. రోజూ ఎంతమేర గుమ్మడి విత్తనాలను తీసుకుంటే ఏ ప్రయోజనాలు ఉన్నాయో.. ఇప్పుడు తెలుసుకుందాం.
*గుమ్మడి విత్తనాలు (Pumpkin Seeds)లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ వీటిని తినడం వల్ల స్త్రీలకు రొమ్ము క్యాన్సర్, పురుషులకు ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
*గుమ్మడి విత్తనాలను డైరెక్ట్ గా అలానే తినే కంటే నీటిలో నానబెట్టి తినడం మంచిది. లేదా దోరగా వేయించి తినాలి. అప్పుడే మలబద్ధకం సమస్య రాకుండా ఉంటుంది.
*బరువు తగ్గాలనుకునేవారు ఎలాంటి డౌట్ లేకుండా ఈ విత్తనాలు తినొచ్చు. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి.. చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.
*వీటిలో ఉండే మెగ్నీషియం రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. పురుషులలో వీర్య కణాల నాణ్యత కూడా పెరుగుతుంది. నిద్రలేమితో బాధపడే వారు కూడా గుమ్మడి విత్తనాలను తింటే.. ప్రశాంతమైన నిద్ర కలుగుతుంది.
*ప్రతిరోజూ అరకప్పు గుమ్మడి విత్తనాలను స్నాక్ గా తినవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. అంతకు మించి తింటే కడుపు ఉబ్బరం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి.. వైద్యుల సూచన మేరకు మితంగా తినడమే మేలు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి